జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. దిల్ రాజు,బోని కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఉగాదికి అదిరిపోయే వార్త వకీల్‌సాబ్‌ చిత్ర యూనిట్ ఇవ్వనుంది. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వకీల్‌ సాబ్‌ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. 

 

తాజాగా ఈ సినిమా పాటను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట యుట్యూబ్ లో సంచలనంగా మారింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ సినిమా గురించి ఏ వార్త బయటకు వచ్చినా సరే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా బాలీవుడ్ లో విడుదల అయి మంచి విజయం సాధించింది. అక్కడ పింక్ అనే టైటిల్ తో ఈ సినిమా వచ్చింది. 

 

ఇక ఈ సినిమా మార్కెట్ పై ఇప్పుడు అనేక అంచనాలు వినపడుతున్నాయి. దాదాపు 200 కోట్ల మార్కెట్ ఈ సినిమాకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీనితో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత వస్తున్న ఈ సినిమా ఆయనకు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: