ప్రస్తుతం తరం అంత సోషల్ మీడియాకు అతుక్కుపోయి ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలే ఎక్కువ హాల్ చల్ చేస్తున్నాయి. ఇక పోతే సోషల్ మీడియాలో ప్రముఖులంతా కూడా ట్విట్స్ పెడుతూ ఉంటారు.. అలాంటి కొన్ని ట్విట్స్ లో ఈ వారం ఏ ట్విట్స్ బాగా ట్రెండ్ అయ్యాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

మోడీ ట్విట్.. 

 

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అన్ని సామాజిక మాధ్యమ వేదికల నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు ట్వీట్‌చేసి సంచలనం రేపారు. ‘‘ఈ ఆదివారం నుంచి ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. ఇలా అన్నింటి నుంచీ వైదొలగాలని ఆలోచిస్తున్నా. ఏ విషయమూ మీకు తెలియపరుస్తా’’ అని తన ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే అయన చెప్పినట్టే ఈరోజు అయన సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశారు. అయితే అయన ట్విట్ చుసిన నెటిజన్లు ఆ ట్విట్ ని ఓ రేంజ్ లో వైరల్ చేశారు. 

 

 

ఫేస్ మాస్క్ పై ఉపాసన ట్వీట్.. 

 

 మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేష్‌, అపోలో లైఫ్‌ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన  సోషల్‌ మీడియా వేదికగా కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలి అని.. అవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అని ఆమె తెలిపారు. అవి ఎలా చేయాలో చేసి చూపించారు. మార్కెట్ లో దొరికే మాస్క్ ల కోసం ఎదురుచూడకుండా ఇంట్లో ఉండే టిష్యూ పేపర్ లతో మాస్క్ లు తయారు చేసుకోవచ్చని చూపించారు.. ఈ ట్విట్ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. 

 

 

కరోనా వైరస్'పై ఛార్మి పిచ్చి ట్విట్.. 

 

కరోనా వైరస్ వచ్చి ప్రపంచ దేశాలు వణికిసచ్చిపోతుంటే.. ఈ పిచ్చి ఛార్మి కరోనా వైరస్ భారత్ లోకి వచ్చింది అని తెగ ఆనందం వ్యక్తం చేసింది.. దీంతో ఆ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుద్ధి ఉందా? అందరూ చస్తుంటే నీకు ఆనందంగా ఉందా అంటూ తిట్టి పడేసారు. దీంతో దెబ్బకు ట్విట్ డిలీట్ చేసింది. కానీ ఆ ట్విట్ సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: