టాలీవుడ్ లో ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాల పరిస్థితి గందరగోళగా మారింది. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏ సమ్మర్ లో రాలేదనే చెప్పాలి. దాంతో మేకర్స్ అందరికి గుండెల్లో రళ్ళు పరిగెడుతున్నాయి. ఒక్క సారిగా టాలీవుడ్ మేకర్స్ ప్లాన్స్ అన్ని తలకిందులయ్యాయని చాలా మంది మేకర్స్ లబో దిబో అంటున్నారు. ఒక పక్క కరోనా..మరోపక్క ఆంధ్రలో లోకల్ బాడీ ఎన్నికలు..ఇంకోపక్క టెన్త్ పరీక్షల వాయిదా. ఈ మూడూ ఇఫ్పుడు సినిమాల విడుదల విషయంలో గట్టి ప్రభావం చూపించబోతున్నాయి. గత నెలాఖరు నుంచే థియేటర్లలో కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. పాపం భారీగా కలెక్షన్స్ వస్తాయనుకున్న భీష్మ సినిమాకి కూడా అంతంత మత్రంగానే వచ్చాయి.

 

ఇక రీసెంట్ గా వచ్చిన పలాస సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికి కలెక్షన్స్ బాగా డాపయ్యాయి అని అంటున్నారు. దాంతో పాటు ఫ్యామిలీలు రాకపోవడం కూడా సినిమాలకు కష్ట తరంగా మారింది. అందుకు ముఖ్య కారణం ఇంటర్ ఎగ్జాంస్ జరుగుతున్నాయి కాబట్టి జనాలు ఎవరూ ధియోటర్స్ వైపు వచ్చే ఛాన్సే లేదు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో కరోనా వైరస్ వచ్చి పడింది. అయినా 25న ఉగాది పండగ ఉంది అప్పటికి వరకు పరిక్షలు అన్నీ అయిపోతాయి అనుకున్నారు. సినిమాలు వరుసగా రిలీజ్ కి ప్లాన్ చేసారు. 25న, 2న, ఇలా ప్రతివారం మంచి సినిమాలు వున్నాయి. కానీ ఆంధ్రలో స్థానిక ఎన్నికలు రావడంతో ఇప్పుడు ఇదో పెద్ద సమస్య గా తయారైంది. 

 

అందుకే పదవ తరగతి పరిక్షలు కూడా వాయిదా వేసారు. దాంతో మార్చ్ 15 నుండి ఆ నెలాఖరు వరకు ఎగ్జాంస్ తో అందరూ బిజీగా ఉంటారు. దీంతో ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన అరణ్య సినిమా వాయిదా వేస్తారట. ఎందుకంటే ఈ సినిమా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా విడుదల కావాల్సి వుంది. అక్కడ కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే వుంది. అందుకని ఈ సినిమా ఏప్రియల్ 24 షిఫ్ట్ అయిందని తెలుస్తోంది. అంతేకాదు అనుష్క నిశ్శబ్దం, మైత్రీ సంస్థ నిర్మించిన ఉప్పెన సినిమాలకి కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తారో మేకర్స్ పాపం.  

మరింత సమాచారం తెలుసుకోండి: