సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి గత సంవత్సరం వరకు ఎలాంటి విమర్శలు లేవు. అసలు ఆయన గురించి విమర్శించడానికి కామెంట్స్ చేయడానికి ఏవీ ఉండేవి కాదు. ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా సినిమాకి సంబంధించన విషయాలు తప్ప అంతకు మించి ఏవీ విషయాలు మాట్లాడే వాడు కాదు. ఇక పబ్లిక్ ఫంక్షన్స్ లో చాలా సెటిల్డ్ గా మాట్లాడతారు సూపర్ స్టార్. ఇక ఆయన సినిమా సినిమాకి గ్లామర్ విపరీతంగా పెరిగిపోతుంది. వయసు పెరిగే కొద్ది అందగాడిగా తయారవౌతున్నారు. 

 

మహేష్ బాబు ని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తుంటే చూపు తిప్పుకోలేరు. ఇక అమ్మాయిలైతే ఇప్పటికీ మహేష్ బాబు కి పెళ్ళికాకుంటే బావుండు అన్నట్టుగా ఫీలవుతుంటరు. ఇక సంక్రాంతికి అల వైకుంఠపురం సినిమాతో పోటీ పడి మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకుంది. మాస్ హీరోగా మహేష్ బాబు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఆ సినిమా తర్వాత వెంటనే మహేష్ బాబు మరో సినిమాని మొదలు పెట్టి సమ్మర్ లో లేదా దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు మహేష్ బాబు నటించబోయో నెక్స్ట్ సినిమా ఏంటో క్లారిటి లేదు.

 

కాని అల్లు అర్జున్ మాత్రం లెక్కల మాస్టారు సుకుమార్ తో సెట్స్ మీద ఉన్నాడు. దాంతో మహేష్ ఫ్యాన్స్ కి బాగా రగిలిపోతుంది. అందుకు మరో కారణం ఏమిటంటే ఈ సూపర్ స్టార్ సినిమా కబురు చెప్పకుండా యాడ్స్ లో బాగా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఒక ప్రముఖ ఛానల్ లో సీరియల్స్ ని ప్రమోట్ చేస్తు కనిపిస్తున్నారు. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి నచ్చడం లేదట. మేము ఎంతో ఆశగా సినిమా అప్‌డేట్స్ ఇస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మీరు ఇలా టీవి లో సీరియల్స్ ప్రమోట్ చెయడం ఎంటి ..అంటూ కామెంట్స్ చేస్తున్నారట. మీరు ఇక ఇలా యాడ్స్ సీరియల్స్ ప్రమోట్ చేస్తూనే ఉంటారా లేదా సినిమాలు చేస్తారా ..ఏదైనా ఒక క్లారిటి ఇవ్వండి అంటూ అడుగుతున్నారట. నిజమే కదా సూపర్ స్టార్ ని సిల్వర్ స్క్రీన్ ఈద చూడాలనుకునే వాళ్ళకి ఇది పెద్ద డిసప్పాయింట్ కదా ..!  

మరింత సమాచారం తెలుసుకోండి: