పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా సినిమా 'వకీల్ సాబ్'. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ గా ఖర్చు చేస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేయాల్సిన టాకీ పార్ట్ కంప్లీటయిందట. దాంతో ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. అందుకు కారణం దిల్ రాజు ఈ మధ్య కొన్ని సినిమాలకి అసలు పబ్లిసిటి చేయకపోవడం తోనే జనాలకి చేరడం లేదని బాగా టాలీవుడ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒక్కటే చిన్న సినిమా అని ఊరుకున్నా సమంత శర్వానంద్ నటించిన కోలీవుడ్ హిట్ సినిమా 96 ని జాను గా రీమేక్ చేశారు. ఈ సినిమాకి ముందు సమంత ఒప్పుకోకపోయినప్పటికి దిల్ రాజు వెంట పడి మరీ ఒప్పించాడు. హిట్ గ్యారెంటీ అని నమ్మించాడు. 

 

దాంతో సమంత కూడా హ్యాట్రిక్ హిట్ దక్కుతుందని ఆశపడింది. అంతకముందు ఆల్రెడీ మజిలీ, ఓ బేబీ సినిమాలతో హిట్స్ అందుకోవడంతో ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఇక శర్వానంద్ కూడా శతమానం భవతి సినిమా తర్వాత మళ్ళీ హిట్ దక్కకపోవడంతో దిల్ రాజు మాటలు నమ్మి జాను సినిమా మీదా చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ దిల్ రాజు ఈ ఇద్దరిని బాగా మోసం చేశాడు. రిలీజ్ సమయం దగ్గర పడుతున్నా కూడా ఓవర్ కాంఫిడెన్స్ తో సినిమాకి ప్రమోషన్స్ చేయకుండా గాలికి వదిలేశాడు. దాంతో సమంత శర్వానంద్ కి గట్టి దెబ్బ పడింది. అందుకే ఈ సారి ఆ తప్పు చేయొద్దంటూ అసలే పవర్ స్టార్ సినిమా కాబట్టి అజాగ్రత్త వద్దని సూచించారట. దాంతో ఇప్పటినుంచే ఈ సినిమా హడావుడి మొదలైంది. 

 

అందులో భాగంగా 'వకీల్ సాబ్' సినిమా నుంచి 'మగువా మగువా' అంటూ సాగే పాటను విడుదల చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ పాటకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. మంచి ఫామ్ లో ఉన్న థమన్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందిస్తుండటం తో ఈ సినిమాలోని పాటల మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి పాట 'మగువా మగువా' ప్రేక్షకులకి అంతగా నచ్చలేదన్న టాక్ వినిపిస్తుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించ్న ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. 

 

అయితే ఈ పాట సూపర్ అన్న టాక్ రాకపోవడంతో పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. దాంతో కొందరు పవన్ అభిమానులు థమన్ ని ట్రోల్ చేస్తూ ఏకేస్తున్నారు. బన్నీ అల వైకుంఠపురములో సినిమాకు సూపర్ సాంగ్స్ ఇచ్చి ఇప్పుడు పవన్ సినిమా కు ఇలాంటి పనికిమాలిన సాంగ్ ఇస్తావా.. అంటూ థమన్ ని నాటుగా మాస్ భషలో కామెంట్స్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సాంగ్ విన్న పవన్ కళ్యాణ్ కూడా అసహనం తో ఉన్నారట. ఏంటి థమ్న్ ఇలాంటి సాంగ్ ఇచ్చాడు ..జనాలకి నచ్చడం లేదే అని ఫీలవుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: