యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా నటిస్తున్నారు. జనవరి 8న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇక దాని అనంతరం ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమా అప్ డేట్ కూడా ఇటీవల రావడం జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆయన తదుపరి సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో పలు వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతన్నాయి. 

 

అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ తో పలు రాజకీయ అంశాలతో పాటు మంచి ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా కలగలిపి దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారని, అలానే వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అరవింద సమేతకు పూర్తిగా భిన్నంగా సాగనున్న ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. 

 

గతంలో అరవింద సమేతకు మంచి సాంగ్స్ అందించిన థమన్, ఇటీవల త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాకు కూడా మ్యూజిక్ అందించాడు. అయితే ప్రస్తుతం థమన్ షెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నాయని, మరి ఇటువంటి పరిస్థితుల్లో వారి సినిమాకు అతడు సమయం కేటాయించగలడా అనే దానిపై అతడి నుండి ఇంకా కన్ఫర్మేషన్ రావలసి ఉందని సమాచారం. గతంలో కూడా పలు ఎన్టీఆర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్, ఇదే కనుక నిజం అయితే మరొక్కసారి ఆయన సినిమాకు ఛాన్స్ దక్కించుకున్నట్లే మరి. కాగా ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: