పూరి జగన్నాధ్ డేరింగ్ స్టెప్స్ గురించి అందరికి తెలిసిందే. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా అందులో ఆయన మార్క్ మేకింగ్ స్టైల్ కి అందరూ ఫిదా అయిపోతారు. ఇక హీరో ని ఎస్టాబ్లిష్ చేయడం గాని, స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం గాని ఏ టాలీవుడ్, బాలీవుడ్ దర్శకుడు చ్జేయలేని విధంగా చేయడం ఆయన ప్రత్యేకత. పూరి సినిమాలో ఇప్పటి వరకు ఒక్క హీరో ని కూడా క్లాస్ గా చూపించింది. ఊర మాస్ యాంగిల్ లో హీరోయిజం ఉండటం ఒక్క పూరి తెరకెక్కించే సినిమాలలోనే. పూరి హీరో ఎలా ఉంటాడో పూరి స్టైల్స్ ని చూస్తే అర్థమవుతుంది అంటారు. మహేష్ బాబు తో సినిమా చేసినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసినా వాళ్ళు కూడా పూరి స్టైల్ లో దిగిపోతారు. 

 

అంతే కాదు లేటు వయసులో నందమూరి నట సింహం బాల కృష్ణ ని పూరి మాంచి ఎనర్జీతో చూపించారు. మావా ఎక్ పెగ్ లా అంటూ డాన్స్ చేపించారు. అదీ పూరి అంటే. అయితే పూరి కి వరుస ఫ్లాప్స్ వచ్చి బాగా దిగాలుపడ్డ సమయంలో 'ఇస్మార్ట్ శంకర్' డబుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమాతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన పూరీ ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటినుంచి పూరి టీం రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తున్నారు. ఆయన ఏ సినిమాకైనా ఇలాగే రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూ జనాల అటెన్షన్స్ ని సెట్ చేసుకుంటాడు. అయితే రీసెంట్ గా షూటింగ్ లొకేషన్ లో పూరి సిగరెట్ చేతిలో పట్టుకొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ నిలుచున్నారు. 

 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పూరి డైనమిక్ లుక్ లో అదిరిపోయాడు. ఒక హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందో అలానే పూరి లుక్ ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు కొంతమంది ఈ సినిమాలో పూరి ఒక ఫెంటాస్టిక్ రోల్ లో నటిస్తున్నాడని అదే ఈ లుక్ అని అంటున్నారు. అలా అనుకోవడానికి కారణం ఆయన ఇంతక ముందు కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అందుకే ఈ సినిమాలో ఈసారి ఒక అదిరిపోయో క్యారెక్టర్ చేస్తున్నారట .. అంటూ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సినిమా మొదలయ్యో ముందు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా తీశేయండి అంటు ఇస్మార్ట్ శంకర్ స్టైల్లో సరదాగా కామెంట్ పెట్టారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: