సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అందరికి పెద్ద దిక్కుగా ఉన్నారు. దాసరి నారయాణ గారు లేని లోటుని భర్తీ చేస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చిన అందరు ఆయన వైపే ఆయన మాట సహాయం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక చిరంజీవి గారు దాదాపు పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ ఖైదీ నంబర్ 150 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికీ అదే చరిష్మా తో చిరంజీవి లో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. డాన్స్ విషయంలో కూడా నా తర్వాతే ఎవరైనా అని ఖైదీ నంబర్ 150 తో ప్రూవ్ చేశారు.

 

ఇక సైరా నరసింహా రెడ్డి తో యాక్షన్ సీన్స్ లో కూడా తన స్టామినా ఇది అంటూ చూపించారు. మెగాస్టార్ కి 60 ఏళ్ళు దాటాయంటే ఆయన రీ ఎంట్రీ సినిమాలు చూసిన ఎవరూ ఒప్పుకోరు. ఇక తాజాగా కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ నటిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అవినీతిని అరికట్టే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. అంతేకాదు ఆచార్య టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు మహేష్ బాబు 40 కోట్లు డిమాండ్ చేశారని అందుకు యూనిట్ ఒప్పుకుందని కూడా సమాచారం. ఇక మే మూడో వారం నుండి మహేష్ బాబు ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నరట.

 

అయితే ఇప్పుడు చిరంజీవి గారి రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయట. ఎందుకంటే మహేష్ బాబే 40 కోట్లు తీసుకుంటుంటే ఇక ఈ సినిమాలో మేయిన్ హీరోగా నటిస్తున్న చిరంజీవి ఎంత తీసుకుంటున్నారో అన్న ఆసక్తి అందరిలోను మొదలైంది. అయితే ఇక్కడ అసలు విషయం తెలిస్తే ఒక్కొక్కరికి మైండ్ కాసేపు పనిచేయకుండా ఆగిపోవాల్సిందే. అవును చిరంజీవిసినిమా కే కాదు ఏ సినిమాకి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడరట. మేకర్స్ ఎంత ఆఫర్ చేస్తే అదే రెమ్యునరేషన్ అని అనుకుంటారట. ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో స్టార్ డిరెక్టర్ కోడి రామకృష్ణ తెలిపారు. ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అన్న మాట విని భయపడే ఒకే ఒక్క వ్యక్తి చిరంజీవి గారే అని కోడి రామకృష్ణ తెలిపారు. అలానే ఇప్పటికి మెగాస్టార్ రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయరట. శిఖరం అంత ఎత్తులో ఉన్న కూడా చిరంజీవి రెమ్యూనరేషన్ గురించి ఆలోచించరు. కానీ ఇప్పుడున్న కొంతమంది మాత్రం రెమ్యూనరేషన్ విషయంలోనే డిఫ్రెన్సెస్ వచ్చి మంచి ప్రాజెక్ట్స్ ని వదులుకుంటున్నారు.  ఎప్పుడు కళ్ళు తెరుస్తారో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: