అదిరింది.. జబర్దస్త్ ప్రోగ్రామ్ కు పోటీగా మొదలు పెట్టిన ప్రోగ్రామ్.. కానీ అనుకున్నంతగా సక్సస్ కాలేదు. అనుకున్నంతగా కాదు..అస్సలు పోటీ ఇవ్వలేదు. ఇప్పుడు నాగబాబు లేకపోయినా జబర్దస్త్ మాత్రం బాగానే దూసుకుపోతోంది. అయితే అదిరింది ప్రోగ్రామ్ సక్సస్ కాకపోవడంతో.. ఆ ఛానల్ నిర్వహకులు మల్లగుల్లాలు పడుతున్నారట.

 

 

ఎలాగైనా సరే ఆ షోను హిట్ చేయాలని రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇక్కడ జబర్దస్త్ టీమ్ మరో ఎత్తు వేసింది. సరిగ్గా అదిరింది షో వచ్చే సమయంలోనే పోటీగా జబర్దస్త్ పాత ఎపిసోడ్లు ప్రసారం చేయడం ప్రారంభించారు. ఐడియా కూడా బాగానే వర్కవుట్ అయ్యింది.

 

 

దీంతో ఏం చేయాలో అర్థంకాని నిర్వాహకులు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అదిరింది ప్రోగ్రామ్ యాంకర్.. సమీరాను తీసేసి వేరే వారిని పెట్టుకున్నారు. అయితే ఈ విషయం అస్సలు సమీరాకు చెప్పనేలేదని తెలుస్తోంది. అంతే కాదట.. ఆమెను 26 ఎపిసోడ్ల కోసం అగ్రిమెంట్ చేసుకుని కేవలం 10 ఎపిసోడ్లు కాగానే పక్కకు పెట్టేశారు.

 

 

అయితే సమీరాను ఎందుకు తీసేశారనే దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. కానీ.. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సమీరాను గ్లామర్ డోస్ పెంచమని అడిగారట. పచ్చిగా చెప్పాలంటే.. అందాలు ఆరబోయాలి అని చెప్పడమే. కానీ ఇదేమీ సినిమా కాదు కదా.. టీవీ కదా.. అందుకే సమీరా అందుకు ఒప్పుకోలేదని తెలిసింది. ఆ కారణంతోనే ఆమెను ఈ షో నుంచి తప్పించారని టాక్ వినిపిస్తోంది. మరి సమీరాను ఎందుకు తీసేశారో.. నాగబాబు అయినా క్లారిటీ ఇస్తే బావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: