టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ పాయల్ రాజపుత్. వాస్తవానికి అంతకముందు ఒక హిందీ, మరొక పంజాబి సినిమాల్లో నటించిన పాయల్, అనుకోకుండా ఆర్ఎక్స్ 100లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. అలానే ఆ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్ కొట్టడం కూడా పాయల్ కు కెరీర్ పరంగా బాగా కలిసి వచ్చింది. వాస్తవానికి ఆ సినిమాలో అందంతో పాటు మంచి అభినయానికి వీలున్న పాత్రలో ఆమె నటించింది అని చెప్పడం కంటే జీవించింది అనే చెప్పాలి. 

 

ఆ సినిమాలో హీరో తో పాటు కొన్ని సీన్స్ లో మంచి నటన కనబరిచిన పాయల్, ఆ తరువాత వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డిఎక్స్ లవ్ తదితర సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం ఏంజెల్ అనే తమిళ సినిమాతో పాటు మరొక తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. ఇక మొదటి నుండి ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ లో బాగా యాక్టీవ్ గా ఉండడం అలవాటు. అలానే తన సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాలు, ఎప్పటికప్పుడు తాను దిగిన ఫోటోలు కూడా పోస్ట్ చేసే అలవాటున్న పాయల్, ఇటీవల గ్రీన్, ఆరెంజ్ రంగులు కలగలిపిన మంచి ట్రెడిషనల్ వేర్ దుస్తుల్లో ఫోటోలు దిగి వాటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. 

 

అయితే ఎక్కువగా లేటెస్ట్ ట్రెండీ దుస్తుల్లో కనపడే పాయల్, ఈ విధంగా ఒక్కసారిగా ట్రెడిషనల్ వేర్ లుక్ లో కనపడే సరికి ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ ఫోటోలు చూసిన పలువురు ఆమె ఫ్యాన్స్, ఆ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తుంటే మా గుండె గాయబే మేడం అంటూ పలు మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: