టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్ర రాజం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ నటులైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యధిక ఖర్చుతో నిర్మిస్తుండగా, వి విజయేంద్ర ప్రసాద్ కథని, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. వారి సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవూడ్, హాలీవుడ్ కి చెందిన పలువురు నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ముందుగా ఈ సినిమాని ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేద్దాం అని భావించిన సినిమా యూనిట్, సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటితో పాటు క్వాలిటీ పరంగా మరికొంత సమయం పట్టడంతో, చివరికి సినిమాని రాబోయే జనవరి 8కి వాయిదా వేశారు. ఇక ఇటీవల బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకున్న రాజమౌళి, ఈ సినిమాకు దర్శకుడు కావడం, అలానే రెండు బడా ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు తొలిసారిగా కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా బిజినెస్ విపరీతమైన భారీ రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందుగా ఈ ఏడాది జులై లో వస్తుందనుకుని, ఆ తరువాత ఏకంగా మలి జనవరికి వాయిదా పడడం, అలానే అదే సమయంలో వరుసగా సంక్రాంతి సెలవలు కూడా ఉండడం వంటి అంశాలు సినిమా సక్సెస్ బాగా మేలు చేయనున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు. అందువలన సినిమా బిజినెస్ మరింతగా పెరిగి ఊహకందని స్థాయికి చేరిందని, ఇక ఇటీవల జరిగిన ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే ఎంతటి వారికైనా ముచ్చెమటలు పట్టడం ఖాయం అని అంటున్నారు. 

 

దాదాపుగా చాల ఏరియాల్లో కూడా, ఒక బడా హీరో సినిమా మార్కెట్ కు మించి ఏకంగా మూడు రెట్లు బిజినెస్ చేసిన ఈ సినిమా, మంచి టాక్ ని సంపాదిస్తే మాత్రం సునాయాసంగా భారీ వసూళ్లు అందుకుంటుందని, అయితే సినిమా ఫలితం ఏ మాత్రం కొద్దిగా తేడా వచ్చినా సరే, దానివలన జరిగే పరిణామాలు ఊహకందనివి అనే భయం, సినిమాని కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల మనసులో ఉందట. అయితే మొదటి నుండి కూడా తన సినిమాలను ఒక ప్రణాళిక ప్రకారం తీసే అలవాటున్న రాజమౌళి, తప్పకుండా దీనిని కూడా సూపర్ హిట్ చేసి తీరుతారని, అంతేకాక బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో అన్ని అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందని ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: