యాంకర్ గా సూపర్ ఫాం లో ఉన్న ప్రదీప్ సడెన్ గా హీరో అవ్వాలన్న థాట్ వచ్చింది. అయితే అందరిలా కాకుండా కొత్తగా ఓ సాంగ్ తో తన సినిమా ఎనౌన్స్ మెంట్ చేసి షాక్ ఇచ్చాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? అంటూ ప్రదీప్ హీరోగా తొలి ప్రయత్నం చేస్తున్నాడు. నీలి నీలి ఆకాశం అంటూ ఒ సూపర్ హిట్ సాంగ్ తో సినిమాపై పాజిటివ్ బజ్ ఎర్పడేలా చేసుకున్న ప్రదీప్ ఆ తర్వాత సాంగ్స్ తో కూడా సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు. అయితే మొదటి సాంగ్ సూపర్ హిట్ అవడం వల్ల మిగతా సాంగ్స్ ఎలా ఉన్నా సరే సినిమాపై ఆడియెన్స్ ఇంట్రెస్ట్ పెరిగింది. నీలి నీలి ఆకాశం సాంగ్ ఎప్పుడు వెండితెర మీద చూడాలా అని ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

 

సినిమాలో అమృత అయ్యార హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను మున్నా డైరెక్ట్ చేశారు. ప్రదీప్ కూడా తనకు బుల్లితెర మీద ఉన్న ఇమేజ్ మొత్తం వాడేస్తూ ఈ సినిమాను బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నాడు. మార్చి 25న రిలీజ్ ప్లాన్ చేసిన ప్రదీప్.. నాచురల్ స్టార్ నాని వికి పోటీగా ఈ సినిమాను దించుతున్నాడు. నాని సినిమాతో పోటీ పడటం అంటే అంత ఈజీ థింగ్ ఏమి కాదు. ఇదే కాకుండా రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా కూడా ఆరోజే రిలీజ్ అవుతుంది.

 

ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓకే లేదంటే మాత్రం ప్రదీప్ కెరియర్ రిస్క్ లో పడినట్టే అని చెప్పొచ్చు. యాంకర్ గా రెగ్యులర్ షోలు చేసుకునే ప్రదీప్ హీరోగా మారాక అలాంటి షోలు చేసే అవకాశం ఉంటుందా లేదా.. హీరోగా మారాక ప్రదీప్ లో మార్పులు ఏమైనా వచ్చాయా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. సినిమా హీరోగా మారిన ప్రదీప్సినిమా రిజల్ట్ తేడా కొడితే ఆ ఎఫెక్ట్ అతని బుల్లితెర ఇమేజ్ మీద పడుతుందని చెప్పొచ్చు. మరి ప్రదీప్ ఏం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: