‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తో రాజమౌళి తో సమానంగా త్రివిక్రమ్ క్రేజ్ పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్థుతం టాప్ హీరోలు బడా నిర్మాణ సంస్థల దృష్టి అంతా త్రివిక్రమ్ పైనే ఉంది. ఈ నేపధ్యంలో పవన్ త్రివిక్రమ్ మ్యానియాను తన సంపాదన కోసం వాడుకోవడానికి వేసిన మాష్టర్ ప్లాన్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


ప్రస్థుతం త్రివిక్రమ్ జూనియర్ తో మొదలు పెట్టబోతున్న మూవీ వచ్చే ఏడాది ఏప్రియల్ లో విడుదలయ్యే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మూవీ విడుదల అయిన వెంటనే తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేసి పెట్టమని ఇప్పటి నుంచే పవన్ త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో రామ్ చరణ్ ను హీరోగా నటింప చేస్తూ కథ రీత్యా అవకాశం ఉంటే తాను ప్రత్యేక పాత్రలో నటిస్తానని పవన్ త్రివిక్రమ్ తో రాయబారాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఇప్పటి నుండే ఇచ్చి త్రివిక్రమ్ కు రెండవ ఆలోచన లేకుండా చేయాలని పవన్ ప్లాన్ అని అంటున్నారు. 


అయితే త్రివిక్రమ్ మాత్రం ఈ విషయమై పవన్ కు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా సమయం ఇంకా చాల ఉంది కాబట్టి అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిద్దాం అని చెపుతున్నా పవన్ మాత్రం తన పట్టుదలను విడవడం లేదు అని అంటున్నారు. ఇప్పటికే వరసపెట్టి సినిమాలు చేస్తూ భారీ పారితోషికాలు తీసుకుంటున్న పవన్ ఇక రానున్న రోజులలో తన నిర్మాణ సంస్థ పై మెగా యంగ్ హీరోలతో వరసపెట్టి సినిమాలు తీస్తూ నిర్మాతగా హీరోగా ద్విపాత్రాభినయం కొనసాగించ బోతున్నాడు అనుకోవాలి. ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో పవన్ స్పీడ్ చూసి అతడి అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: