పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ‌త రెండేళ్ళుగా రాజ‌కియాల‌తో ఫుల్ బిజీగాక ఉన్న విష‌యం తెలిసిందే. ఎంత గ్యాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న క్రేజ్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ పింక్ రీమేక్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. `వ‌కీల్‌సాబ్‌`గాటైటిల్‌ని కూడా నిర్ణ‌యించారు. అయితే ఇటీవ‌లె విడుద‌లైన పోస్ట‌ర్‌కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంతో పాటుగా పవన్ లైన్ లో చాలా సినిమాలనే పెట్టేసారు. క్రిష్‌, హ‌రీష్‌శంక‌ర్‌, పూరి ఇలా చాలా మంది సినిమాల‌కి వ‌రుస‌గా ఆయ‌న డేట్లు ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్ పండ‌గ మాములుగా లేదు. అలా ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చిన కొద్ది లోపే పవన్ తదుపరి చిత్రాలు కొన్ని కన్ఫర్మ్ అయిపోయాయి.

 

ఇక ఇదిలా ఉంటే...అలా వీటితో పాటుగా కొన్ని అధికారికంగా కావాల్సినవి కూడా ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక‌టి అలాంటి ప్రాజెక్టే  రెడీ కాబోతున్నట్టు స‌మాచారం. అదే పవన్ తో ఇప్పటికే “కాటమరాయుడు” అనే ప్లాప్ సినిమా తీసిన దర్శకుడు డాలీ తో ఓ సినిమా కన్ఫర్మ్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తుంది. మ‌రి ఆ సినిమా అంత పెద్ద ఫ్లాప్ చేశాక కూడా ప‌వ‌న్ మ‌ళ్ళీ ఆ ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇవ్వ‌డం ఏంట‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు. అంతేకాక ప‌వ‌న్‌కి మ‌తి ఉందా లేదా అన్న‌ట్లు కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రి ఆ ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చిన దాని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ బజ్ సోషల్ మీడియాలో పవన్ అభిమానుల మధ్యనే నడుస్తుంది.

 

దీనికి ఆయ‌న ఏం స‌మాధానం చెబుతారో వేచి చూడాలి. ప‌వ‌న్, శృతిహాస‌న్ మంచి స్టార్‌క్యాస్ట్ పెట్టి కూడా ఆ సినిమాని అట్ట‌ర్‌ఫ్లాప్ చేశాడు. మ‌రి ఈ సారి ఎలాంటి క‌థ తీసుకువ‌స్తాడు. అది ప‌వ‌న్‌కి నచ్చుద్దా. ఒక‌సారి ఫ్లాప్ కాబ‌ట్టి అస‌లు తిరిగి ఆయ‌న‌కి ఛాన్స్ ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి ఇలా ఎన్నో డౌట్లు ఫ్యాన్స్ మ‌దిలో తిరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ప‌వ‌న్ ఏ సినిమా కైనా ఆరు నెల‌ల‌కు మించి స‌మ‌యాన్ని కేటాయించ‌లేద‌ట‌. చాలా వేగంగా చిత్రాల‌ను షూట్ చేసే ప‌నిలో ప‌డ్డారు ఆయ‌న‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: