బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కి బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్లో చక్రం తిప్పుతూ అగ్రతారగా కొనసాగుతూ వస్తోంది కరీనా కపూర్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఎన్నో గ్లామర్ పాత్రలతో పాటు.. మరెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు కూడా చేస్తూ... బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తో ప్రేమాయణం నడిపి ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా కరీనా కపూర్ కి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 

 

 

 ఇక ప్రస్తుతం కరీనా సైఫ్ అలీఖాన్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బుడతడి పేరే తైమూర్  అలీఖాన్. ప్రస్తుతం ఏ సినిమాలో నటించకుండా నే ఈ బుడతడు  సెలబ్రిటీ హోదాను సంపాదించాడు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ నటిగా తానేమిటో నిరూపించుకుంది. ముఖ్యంగా చమేలి, హీరోయిన్ చిత్రాల్లో  కరీనా  నటించిన పాత్రలు ఎంతో శక్తివంతమైనవి. అంతేకాదు కరీనా కపూర్ కెరీర్ మొత్తంలో ఇవి ఎంతో ప్రత్యేకమైన పాత్రలు కూడా. అయితే కరీనా కపూర్ తాజాగా ఓ షోలో హాజరయ్యింది. ఈ సందర్భంగా తన సినీ కెరీర్లో టాప్ ఫైవ్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకొచ్చింది కరీనాకపూర్. 

 

 

 తాను ఇప్పటివరకు పోషించిన టాప్ ఫైవ్ పాత్రల్లో  హీరోయిన్ సినిమాలో చేసిన పాత్ర కూడా ఒకటి అంటూ తెలిపింది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన హీరోయిన్ సినిమాలో.. కరీనాకపూర్ ఎంతో ధైర్యం చేసి ఏకంగా న్యూడ్ సీన్ లో కూడా నటించింది. అయితే అప్పుడు కరీనాకపూర్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.తాజాగా ఈ పాత్ర గురించి మాట్లాడిన కరీనా ప్రేక్షకులు,  ఇండస్ట్రీ ఏమనుకున్నా సరే... హీరోయిన్ సినిమాలో న్యూడ్ పాత్రలో నటించనందుకు  ఎంతో గర్వ పడుతున్నాను అంటూ కరీనాకపూర్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం తన వంతుగా వందకు వందశాతం కష్టపడ్డాను అంటూ కరీనాకపూర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఆ పాత్ర డిమాండ్ చేయడం వల్లే న్యూడ్ సీన్ లో  నటించను అంటూ తెలిపింది. ఈ సినిమాకు కష్టపడి అంతగా ఏ సినిమాకు కూడా కష్టపడి లేదు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: