తెలుగు సినిమా తొలి తరం నాయకి అంజలి దేవి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లాంటి టాప్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన అంజలీ దేవి, సోషల్‌ సినిమాల ట్రెండ్ ప్రారంభమయ్యే సరికి తల్లి పాత్రలకు టర్న్‌ అయిపోయింది. తన హీరోయిన్‌ గా నటించిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకే తల్లి పాత్రల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా గుమ్మడి, అంజలి దేవిల పెయిర్‌ ఒకప్పుడు టాలీవుడ్‌ సూపర్‌ హిట్ జోడి.


అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి 1950 ల నుంచి  70ల వరకు హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగింది. అంతేకాదు ఆమె నిర్మాతగానూ పలు సూపర్‌ హిట్ చిత్రాలను టాలీవుడ్‌కు అందించింది. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. తరువాత పలు చిత్రాల్లో నటించిన ఆమె లవ కుశ సినిమాతో తెలుగు వారి ఆరాధ్యదైవం సీతమ్మగా మారిపోయింది. లవ కుశ సినిమా తరువాత ఆమె ప్రైవేట్‌ ఫంక్షన్స్‌లో కనిపించినా సీతమ్మగానే గౌరవించేవారు ప్రజలు. ఆమెకు పూజల చేసేవారు.. మరికొందరైతే ఏకంగా సాష్టాంగ నమస్కారాలు కూడా చేసేవారు. ఇక అమ్మ పాత్రల్లో ఆమె ను పండించే కరుణ రసం తరువాత ఎంతో మంది ఆ తరహా పాత్రల్లో నటించేందుకు ఆదర్శంగా నిలిచింది.


అప్పట్లో ఆమె సొంత పనుల మీద బయటికి వెళితే ప్రజలు ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి పూజలు చేసిన సందర్భాలున్నాయి. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది అంజలీ దేవి. 90లలో ఆమె పోషించిన అమ్మ పాత్రలు ఈ జనరేషన్‌కు కూడా గుర్తిండిపోయాయి బృందావనం (1992), అన్నా వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) లాంటి సినిమాలు ఆమె నటించిన చివరి చిత్రాలు. ఈ సినిమాల్లో అమ్మగా ఆమె నటన అనన్య సామాన్యం అంటూ కీర్తించారు సినీ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: