ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి జడ్జిగా కొనసాగిన మెగా బ్రదర్ నాగబాబు కొన్ని భేదాభిప్రాయాలు వల్ల జబర్దస్త్ నుంచి జడ్జిగా తప్పుకొని జీ తెలుగులో అదిరింది అనే ప్రోగ్రాం మొదలు పెట్టిన సంగతి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. అయితే నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ కు షాక్  తగ్గుతుందని... అంతేకాకుండా జబర్దస్త్ కి పోటీగా అదిరింది షో ని  పెట్టడంతో... జబర్దస్త్ రేటింగ్స్ ఒక్కసారిగా పడిపోతుందని అందరు అనుకున్నారు. కానీ అదిరింది షో వచ్చిన జబర్దస్త్ రేటింగ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వాస్తవంగా చెప్పాలంటే అదిరింది షో  జబర్దస్త్ రేటింగ్ కి చేరువులో కూడా లేదు. జబర్దస్త్ కి అదిరింది షో  కనీసం పోటీ కూడా ఇవ్వడం లేదు. దీంతో ఈ షో రేటింగ్ ని పెంచడానికి షో నిర్వాహకులు కూడా నానా తంటాలు పడుతున్నారు. కనీసం అదిరింది షో కి సీరియల్స్ కు వచ్చిన రేటింగ్ కూడా సొంతం చేసుకోవడం లేదు. 

 

 

 అంతేకాకుండా అదిరింది షో వైపు జబర్దస్త్ ప్రేక్షకులకు వెళ్ళిపోకుండా ఉండడానికి అదిరింది షో వచ్చే సమయానికి ఈటీవీలో పాత జబర్దస్త్ ఎపిసోడ్ లని  ప్రసారం చేస్తున్నారు. దీంతో అదిరింది షో వైపు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు బుల్లితెర ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో అదిరింది షో కి రేటింగ్ తీసుకురావడానికి అటు నిర్వాహకులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.... అదిరింది లో మొదటి యాంకర్ గా వచ్చిన సమీరా ను తొలగించి ప్రస్తుతం యాంకర్ రవి, భాను శ్రీ లను తీసుకున్నారు. అయితే సమీరా ను ముందుగా 26 ఎపిసోడ్ ల కోసం అగ్రిమెంట్ తీసుకున్నప్పటికీ 10 ఎపిసోడ్ తర్వాత సమీరా ను పక్కకు పెట్టేశారు. 

 

 

 ఈ నేపథ్యంలో అదిరింది షో నుండి యాంకర్ సమీరా ను తొలగించడానికి వెనుక కారణాలు ఏమిటి అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. షో రేటింగ్ పెంచడానికి అని అందరూ చెబుతున్న... సమీరా తప్పుకోవడానికి వేరే కారణం కూడా ఉంది అంటూ కొన్ని వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ముఖ్యంగా సమీరా ను కాస్త గ్లామర్ ఒలక పోయాలని చెప్పారట... ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేశారట. కానీ దానికి సమీరా  ఒప్పుకోకపోవడంతో.. సమీరా ను  ఈ షో నుంచి తప్పించారు అంటూ... టాక్ వినిపిస్తోంది. అయితే జబర్దస్త్ లో ప్రతి విషయం పై స్పందించిన నాగబాబు అదిరింది విషయంలో మాత్రం... సమీరా ను తప్పించే విషయంలో  ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ కొంత మంది నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: