ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్‌ అంటే పెద్దగా ఇంపార్టెన్స్‌ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మ, అత్త పాత్రలకు కూడా ఒకప్పటి హీరోయిన్స్‌ను తీసుకుంటున్నారు మన మేకర్స్‌. చాలా మంది స్టార్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తుండటంతో దాదాపు అన్ని సినిమాల్లో అమ్మలు గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ కు కూడా స్టార్సే ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్‌. అందుకోసం భారీగా ఖర్చుపెట్టేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఈ డిమాండ్‌ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న సీనియర్‌ నటీమణులు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటి రమ్యకృష్ణ. ఒకప్పుడు టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ అందరి సరసన హీరోయిన్‌గా అదరగొట్టిన ఈమె, ఇప్పుడు పవర్‌ ఫుల్‌ మదర్‌ రోల్స్‌లో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ రేంజే మారిపోయింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తెలుగుతో పాటు సౌత్‌లోని అన్ని సినిమాల్లో వరుస సినిమాలు చేస్తోంది రమ్యకృష్ణ. అంతేకాదు భారీ పారితోషికం కూడ అందుకుంటుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఒక్క రోజుకు దాదాపు 6 లక్షల వరకు పారితోషికం అందుకుంటుందట. అదే ఫుల్‌ లెంగ్త్‌ రోల్ అయితే సినిమాకు కోటిన్నర వరకు డిమాండ్‌ చేస్తోంది.

 

రమ్యకృష్ణకు దరిదాపుల్లో మరో నటి లేకపోవటం విశేషం. అయితే ప్రస్తుతం బిజీగా ఉన్న ఆర్టిస్ట్‌ నదియా. అత్తారింటికి దారేది, మిర్చి లాంటి సినిమాల్లో ఆకట్టుకున్న నదియా గ్లామరస మదర్‌ రోల్స్‌ కు కేరాఫ్ అడ్రస్‌ గా మారింది. అందుకే కొన్ని క్యారెక్టర్స్‌ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటించేందుకు ఈ భామ ఒక్క రోజుకు 3 లక్షల వరకు పారితోషికం డిమాండ్‌ చేస్తుందట. వీళ్లే కాదు తల్లి పాత్రల్లో నటించేందుకు జయసుథ, పవిత్రా లోకేష్‌ లాంటి వారు కూడా భారీగానే డిమాండ్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: