వయస్సు అనేది దేహానికే గానీ మనస్సుకు కాదని చాలమంది లేటువయస్సు వారు నిరూపిస్తున్నారు.. ముదిరిన వయస్సులో కూడా ప్రేమ పెళ్లిలు చేసుకుంటున్నారు.. ఈ ఘటనలు ఒక టాలీవుడ్ రంగంలోనే కాదు. బాలీవుడ్, హలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా తరచుగా కనిపిస్తున్నాయి.. ఇక లోకంలో కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా వారంత సెలబ్రిటీలు కాదు కాబట్టి వార్తల్లోకి ఎక్కడం లేదు.

 

 

ఇకపోతే ఇలాంటి లేటు వయస్సులో లేత అమ్మాయితో ప్రేమలో పడ్డాడు మన టాలీవుడ్, బాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్.. ఈ విలన్ ఫిజిక్ చూసిన ముదురు భామలు ఏంటి, లేత గులాభీలు కూడా వెంటపడవలసిందే.. ఎందుకంటే 51 వ వయస్సులో కూడా 20 ఏళ్ల అబ్బాయిలానే ఫిజిక్‌ని మెయిన్‌టైన్ చేస్తూ ఉంటాడు.. ఇక తెలుగు, హిందీ లాంటి అనేక చిత్రాల్లో విలన్ రోల్ పోషించిన రాహుల్ దేవ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన.. ‘సింహాద్రి’ సినిమాలో విలన్‌గా ప్రేక్షకులకు గుర్తుండిపోయే మంచి క్యారెక్టర్స్ చేశారు.

 

 

ఇదే కాకుండా మాస్‌లో కూడా పవర్‌ఫుల్ విలన్‌గా అలరించాడు.. ఇలా చెప్పుకుంటూ వెళ్లితే రాహూల్ విలనిజానికి ఎన్నో సినిమాలు నిదర్శనంగా నిలుస్తాయి.. ఇక ఈ ముదురు విలన్ 33 ఏళ్ల మోడల్‌ ముగ్ధా గాడ్సేతో డేటింగ్ చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట రాహుల్ భార్య, రయీనా క్యాన్సర్‌తో మరణించారు. ఇక రాహుల్, రయీనాలు చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్తా.. ప్రేమగా మారగా, 1998లో వీరిద్దరూ, వివాహం చేసుకున్నారు. అయితే కొడుకు పుట్టిన 11 ఏళ్లకు రయీనాకు క్యాన్సర్ ఉందని తెలియగా, రాహుల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి భార్యతోనే గడిపాడు... కానీ అప్పటికే ఆమెకు క్యాన్సర్ ముదరడంతో 2009లో కన్నుమూశారు..

 

 

ఇక కొన్నాళ్లపాటు తీవ్ర విషాదంలో కూరుకుపోయిన  రాహుల్. ఆ బాధ మరవడానికి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయనకు ముగ్ధా పరిచయం అవడం, అది కాస్త.. ప్రేమగా మారిందట.. అయితే వీరిద్దరికీ మధ్య దాదాపు 14 ఏళ్ల వయసు గ్యాప్ ఉంది. అయినా ఇందులో వర్రీ అవ్వాల్సింది లేదని రాహుల్ అన్నారు. ఈ విషయం నా కుమారుడు సిద్ధార్థ్‌తో పాటు ముగ్ధా తల్లిదండ్రులకు కూడా తెలుసని ఓ ఇంటర్య్వూలో తెలిపాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: