ప్రస్థుతం వరస ఫ్లాప్ లతో ఏమాత్రం క్రేజ్ లేకుండా రవితేజ కెరియర్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ కు రవితేజ సహకారాన్ని కోరుతున్నట్లుగా వార్తలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. ‘పింక్’ మూవీకి రీమేక్ గా వస్తున్న ‘వకీల్ సాబ్’ కు కథ పరంగా వేణు శ్రీరామ్ చాల మార్పులు చేసాడు అని తెలుస్తోంది. 


ఇప్పటికే పవన్ కళ్యాణ్ భావజాలానికి అనుగుణంగా ఈ మూవీలోని క్లైమాక్స్ డైలాగ్స్ వ్రాయించిన వేణు శ్రీరామ్ ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ కు క్రేజ్ ను పెంచడానికి మరొక వ్యూహం రచిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో ఒక ప్రత్యేక పాత్రను శృతి హాసన్ తో చేయించి అందరికీ షాక్ ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఇప్పటికే వేణు శ్రీరామ్ ఈ విషయమై శృతి హాసన్ తో రాయబారాలు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శృతి పవన్ పక్కన ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించినా ఆమె డేట్స్ అన్నీ రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ‘క్రాక్’ మూవీకి ఇచ్చి వేయడంతో ఆ మూవీ దర్శక నిర్మాతలు అంగీకరించకుండా తాను డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. 


ఈ సంఘటనతో దిల్ రాజ్ రవితేజా తో రాయబారాలు చేస్తూ శృతి హాసన్ డేట్స్ ను ఎడ్జెస్ట్ చేసే విషయంలో ‘వకీల్ సాబ్’ కు సహకరించ వలసిందిగా కోరుతున్నట్లు టాక్. ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో ‘పింక్’ కథలో లేని చాల మార్పులు ‘వకీల్ సాబ్’ లో కనపడబోతున్నాయని క్లారిటీ వస్తోంది. ఈ విషయాలను పరిశీలిస్తున్న వారు మాత్రం ఒక ఉదాత్తమైన కథకు ఇన్ని కమర్షియల్ టచ్ లు ఇస్తున్నారా అంటూ విమర్శిస్తూ ఉంటే పవన్ అభిమానులు మాత్రం నిజంగా శృతి ‘వకీల్ సాబ్’ లో నటిస్తే ‘గబ్బర్ సింగ్’ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అంటూ ఆనందపడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: