తమిళనాట ఎన్నో విలన్ పాత్రలలో నటించి మెప్పించిన ఆనందరాజ్  ఇప్పుడు కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పుడు ఆనంద్ రాజ్ అంటే విలన్ అంటే ఇలా ఉంటారా అన్న రేంజ్ లో నటించారు.  సూర్యవంశం, పెదరాయుడు లో ఆనంద్ రాజ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.  సీనియర్ నటులతో ఢీ అంటే ఢీ అనే విధంగా నటించి మెప్పించారు.  ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా నటించిన యాక్షన్ జాక్సన్ అనే సినిమాతో విలన్ పాత్రలో బాలీవుడ్ లో ప్రవేశించాడు. దక్షిణాది భాషలన్నీ కలిపి సుమారు వందకు పైగా సినిమాల్లో నటించాడు. 1988లో వచ్చిన ఒరువర్ వాళుం ఆలయం అనే సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు.

 

ప్రభు, శివకుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాలో ఆనందరాజ్ ఓ విలన్ పాత్ర పోషించాడు.  దక్షిణాదిన  రజనీకాంత్, విజయకాంత్, శరత్ కుమార్, మమ్ముట్టి, చిరంజీవి, బాలక్రిష్ణ, విజయ్ లాంటి వారి పక్కన ప్రతినాయకుడిగా నటించాడు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో రావుగోపాలరావు తమ్ముడిగా నటించాడు. తాజాగా ఆనంద్ రాజ్ సోదరుడు కనకసబై ఆత్మహత్య కేసు పలు సంచలనాలు సృష్టించింది. ఇటీవల కనకసబై సూసైడ్ చేసుకున్నట్టు కేసు నమోదు కాగా, తాజాగా ఆయన ఆత్మహత్య లేఖ పోలీసుల చేతికి చిక్కింది.

 

దాని ఆధారంగా ఆనంద్ రాజ్ మరో సోదరుడు భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కనకసబై ఆత్మహత్య చేసుకునే ముందు తన సోదరుడు భాస్కర్, తని కొడుడు శివచంద్రన్ కారణమని ఈ లేఖలో ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, జైలుకు తరలించారు. ఓ ఇంటిని కొనుగోలు చేయడంతో దాన్ని కాజేసేందుకు కొందరు కుట్ర చేశారని ఆనంద్ రాజ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మనస్తాపంతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: