క్రికెట్ లో భారత్ కు మొదటి వన్డే ప్రపంచ కప్ ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కుతున్నచిత్రం 83. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాజీ క్రికెటర్  కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తుండగా రాజ్ బాసిన్, పంకజ్ త్రిపాఠి,బోమన్ ఇరానీ సాహిల్ కట్టర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు అలాగే  కపిల్ దేవ్ భార్య  రోమి దేవ్ పాత్ర లో రణ్వీర్ సతీమణి దీపికా పదుకొనే కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
 
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన  టీజర్, పోస్టర్లు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోగా తాజాగా నిన్న మరో పోస్టర్ ను విడుదలచేశారు. 1983 ప్రపంచ కప్ ను గెలిచి రణ్వీర్ కప్ ను ఎత్తుకొని వున్న ఆఫోటో నెటిజన్లను ఫిదా చేసింది. ముఖ్యంగా ఆ పోస్టర్ లో కపిల్ దేవ్ గెటప్ లో రణ్వీర్ ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈనెల 11న ముంబై లోని ఓ గ్రౌండ్ లో భారీ ఈవెంట్  ద్వారా లాంఛ్ చేయనున్నారు. ఈసినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ తోపాటు తెలుగు ,తమిళ భాషల్లో ఏప్రిల్ 10న విడుదలకానుంది. తెలుగులో 83ని కింగ్ నాగార్జున విడుదలచేస్తుండగా తమిళం లో కమల్ హాసన్ విడుదల చేయనున్నాడు. రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్స్, విబ్రి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రం తో పాటు రణ్వీర్ సింగ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్,అజయ్ దేవగణ్ లతో కలిసి సూర్యవంశీ లో కూడా నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: