హీరోల రెమ్యూనరేషన్ కే కోట్లకు కోట్లు ఖర్చు చెయ్యడంతో హీరోలు ప్రొడ్యూసర్లకు భారమవుతున్నారు.  ఎంత పెద్ద హీరో అయినా రేట్ బాగా పెంచేస్తే ..ప్రొడ్యూసర్లు నో అని చెప్పేస్తున్నారు. 100 కోట్లతో సినిమా చెయ్యడానికే ఆలోచించే ప్రొడ్యూసర్లకు ఇప్పుడు జస్ట్ హీరోకే 100 కోట్లు ఇవ్వాల్సి వస్తోంది. సినిమా సినిమాకీ పెంచేస్తున్న హీరోల రెమ్యూనరేషన్ తో ప్రొడ్యూసర్లకు బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. 

 

ప్రొడ్యూసర్లకు హీరోలు భారమైపోతున్నారు. సినిమా సినిమాకీ హీరోలు పెంచేస్తున్న రెమ్యూనరేషన్ తో  బడ్జెట్ భారీగా పెరిగిపోతోంది. దాంతో మీతో సినిమాలు మేం తియ్యలేం అని చేతులెత్తేస్తున్నారు ప్రొడ్యూసర్లు.   లేటెస్ట్ గా మహేష్ బాబుతో దిల్ రాజు-వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే అంటున్నారు టాలీవుడ్ జనాలు . వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని పబ్లిక్ గా అనౌన్స్ చేసిన మహేష్ ..ఇప్పుడు ఈ సినిమా పక్కనపెట్టేశాడు. 

 

మహేష్ బాబు జనరల్ గా 30 నుంచి 35 కోట్లు తీసుకుంటాడు.  దిల్ రాజు ప్రొడక్షన్స్ లో తెరకెక్కాల్సిన ఈసినిమాకు సంబందించి మహేష్ 50 కోట్లు రెమ్యూనరేషన్ అడిగడంతో..దిల్ రాజు అమ్మో అంతైతే బడ్జెట్ పెరిగిపోతుందని చెప్పాడట. సరే..40 రెమ్యూనరేషన్ , మిగతా 10 కోట్లు ఏఎమ్బీ బ్యానర్ ని ప్రొడక్షన్ లో యాడ్ చేసి ప్రాఫిట్ షేర్స్ ఇమ్మని ప్రపోజల్ పెట్టాడట మహేష్.  . అయినా సరే..అంత ఇవ్వలేం అని దిల్ రాజు చెప్పడంతో సినిమా ఆగిపోయింది. 

 

ఇలా రెమ్యూనరేషన్ తో పెంచేయడంతో పవర్ స్టార్ సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత కాదనుకున్నా.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే 100 కోట్లు మినిమం బడ్జెట్ అయిపోతోంది. ఎందుకంటే రోజుకు ఒకటిన్నర కోటి చొప్పున 20 రోజులకు  పవన్ కళ్యాణ్ కే 50 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 

 

తెలుగు హీరోల్లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో అన్ డౌటెడ్ లీ ప్రభాస్. ప్యాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ .. ఓపెనింగ్స్ తోనే కలెక్షన్లు రాబడుతున్నాడు. మిర్చి సినిమా అప్పుడు 15 కోట్లు తీసుకున్న ప్రభాస్ ..బాహుబలి ఫస్ట్ పార్ట్ కి 30 కోట్లు తీసుకున్నాడు.  బాహుబలి 2 రిలీజ్ అయ్యాక ప్రాఫిట్ లో షేర్స్ తో కలిపి .. 200 కోట్లు పైనే తీసుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: