తెలుగు సినిమాల్లో ఉండే కామెడీ సన్నివేశాలు మరే భాషలో కూడా ఉండవని అంటూంటారు. ఆరోగ్యకరమైన కామెడీకి తెలుగు సినిమా పెట్టింది పేరు. మధ్యలో కొంత వల్గారిటీ వచ్చినా తెలుగు సినిమా తన మార్కు కామెడీని ఎప్పుడూ మిస్ కాలేదు. తెలుగులో ఉన్నంతమంది కమెడియన్లు మరే భాషలో కూడా ఉండరని అంటారు. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందమే ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు కూడా. హాస్యాన్ని పండించే వారిలో ఆన్ స్క్రీన్ కమెడియన్ జంటలు కూడా మనకు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలో బ్రహ్మానందం - కోవై సరళ ముందు వరుసలో ఉన్నారు.

 

 

ఎన్నో సినిమాల్లో వీరిద్దరి జంట తెలుగు ప్రేక్షకులకు సున్నిత హాస్యాన్ని అందించారు. ఇంకా చెప్పాలంటే వీరిద్దరి కామెడీ సిల్వర్ స్క్రీన్ టామ్ అండ్ జెర్రీలా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. 2000వ సంవత్సరంలో వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో బ్రహ్మానందం – కోవై సరళ చేసిన కామెడీసినిమా భారీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. గడుసు పెళ్లాం పాత్రలో కోవై సరళ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటూ భార్యపై అజమాయిషీ చేసే భర్తగా బ్రహ్మానందం ఓ రేంజ్ కామెడీ పండించారు. మధ్యలో బ్రహ్మానందాన్ని.. కోవై సరళ చితక్కొట్టే సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది.

 

 

మంచి సినిమా కావడం దానికి తోడు వీరిద్దరి కామెడీ ప్రభంజనానం తోడై ఆ సినిమా అప్పట్లో 200 రోజులు ఆడింది. తర్వాత ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించి తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ, హనుమాన్ జంక్షన్, సింహరాశి, రాయలసీమ రామన్న చౌదరి, రెబల్, ఎవడిగోలవాడిదే.. వంటి అనేక సినిమాల్లో ఈ జంట హాస్యాన్ని పండించింది. వీరిద్దరూ కలిసి హాస్యం పండిస్తే సినిమా హిట్ అనే పేరు వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: