టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ వందల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అశేషమైన కీర్తిని సంపాదించుకున్నారు. అసలు సిసలైన సహజనటిగా పేరొందిన అన్నపూర్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన అమ్మోబొమ్మ లాంటి చాలా సినిమాల్లో ఆయనకి తల్లిగా నటించి తన సత్తా చూపించింది అన్నపూర్ణ. హలో బ్రదర్, అప్పుల అప్పారావు, అసెంబ్లీ రౌడీ సినిమాలలో అమ్మ వేషాలు వేయడం ప్రారంభించిన అన్నపూర్ణ టాలీవుడ్ మదర్ గానే దశాబ్దాల పాటు కొనసాగింది. ఆమని లాంటి హీరోయిన్లకు కూడా ఆమె తల్లిగా చాలా చక్కగా నటించి అందరి మనసులను దోచుకుంది.




మరోవైపు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తనకి వయసు పైబడిన తర్వాత తండ్రి వేషాలను వేసి అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నలభై సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి సేవలందించిన కైకాల సత్యనారాయణ ని ఎంత కొనియాడినా అది తక్కువ గానే భావించాలి. ఐతే రాజేంద్ర ప్రసాద్, సితార నటించిన బ్రహ్మచారి మొగుడు సినిమాలో అన్నపూర్ణ, కైకాల సత్యనారాయణ కలిసి రాజేంద్ర ప్రసాద్ కి తల్లిదండ్రులు గా నటించారు. ఈ సినిమాలో తల్లిదండ్రులు గా నటించిన వీరిద్దరి నటనా ప్రతిభకు ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తరువాత కైకాల సత్యనారాయణ రాజశేఖర్ లాంటి హీరోలకు తండ్రి పాత్రలో చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.




అయితే మగధీరుడు సినిమాలో చిరంజీవికి తండ్రిగా నటించిన కైకాల సత్యనారాయణ కి తండ్రి పాత్ర చేసినందుకు గాను బాగా పేరు వచ్చింది. ఇకపోతే మొన్నీమధ్య కూడా అన్నపూర్ణ గీతా గోవిందం సినిమాలో ఒక హాస్యభరిత పాత్రలో నటించి తెలుగు అభిమానులను ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఏది ఏమైనా ఇటువంటి అద్భుతమైన నటులు తెలుగు పరిశ్రమలో ఉండటం మనం చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఎన్ని దశాబ్దాలు గడిచినా వీరి నటన మాత్రం ప్రతి సినీ ప్రేక్షకుడిలో చెక్కు చెదరకుండా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: