టాలీవుడ్ లో తరతరాలుగా అమ్మ పాత్రలకు క్రేజ్ తెస్తున్న నటులు చాలామంది ఉన్నారు. ఇప్పుడంటే ఆర్టిస్టులు పరిగారు కాబట్టి కాని అప్పట్లో ఏదైనా సినిమా తల్లి పాత్ర ఉంది అంటే అది కచ్చితంగా అన్నపూర్ణమ్మ చేయాల్సిందే. 80, 90 ల కాలంలో వచ్చిన సినిమాల్లో తల్లి పాత్రల్లో అన్నపూర్ణ ప్రత్యేకత తెచ్చుకుంది. ఇక అప్పుడు చాలావరకు సెంటిమెంట్ సినిమాలే వచ్చేవి. కుటుంబ కథా చిత్రాల్లో తల్లి పాత్రలు కంపల్సరీ. అందుకే అలాంటి సినిమాల్లో అన్నపూర్ణ కచ్చితంగా ఉంటుంది.

 

ఇప్పటికి అన్నపూర్ణ సినిమాల్లో నటిస్తున్నారు. క్యారక్టర్ ఆర్టిస్టుల ప్రస్తావన ముఖ్యంగా టాలీవుడ్ లో మదర్ రోల్స్ ప్రస్తావన వస్తే మాత్రం అన్నపూర్ణ కచ్చితంగా అందరికి గుర్తుకొస్తుంది. ఇక అమ్మ పాత్రలకు అన్నపూర్ణ ఎంత ఫేమస్సో బామ్మ పాత్రలకు అలా ఫేమస్ అయ్యింది నిర్మలమ్మ. అప్పట్లో ప్రతి సినిమాలో నిర్మలమ్మ ఉండేది. బామ్మ పాత్రలకు ఆమె తన ప్రత్యేకత చూపించారు. చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరి హీరోలకు నిర్మలమ్మ బామ్మ పాత్రలు చేసింది. 

 

అయితే తరం మారింది కొత్త నటీనటులు వస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో తల్లి పాత్రలు చేసే నటీనటులు చాలామంది ఉన్నారు కాని బామ్మ పాత్రలకు మాత్రం అంత రిజిస్టర్ అయిన వాళ్ళు లేరని చెప్పొచ్చు. టాలీవుడ్ బామ్మగా నిర్మలమ్మ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోని తిడుతూ.. కొన్ని సినిమాల్లో కొడుతూ ఆమె చేసిన నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అన్నపూర్ణ చేసిన తల్లి పాత్రలే కాదు నిర్మలమ్మ చేసిన బామ్మ పాత్రలు చాలా పాపులర్ అయ్యాయి. అన్నపూర్ణ తర్వాత చాలామంది సినిమాలు తల్లి పాత్రల్లో చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు బామ్మ పోస్ట్ వచ్చింది. ఈమధ్య వచ్చిన రాజా ది గ్రేట్, ఎఫ్-2 సినిమాల్లో అన్నపూర్ణ నటించి మెప్పించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: