గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు లో ప్రధాన ముద్దాయి మారుతిరావు.  మిర్యాలగూడ లో ప్రముఖ వ్యాపారవేత్త, రియలెస్టేటర్  మారుతిరావు కూతురు అమృత తన కాలేజ్ మెట్ ప్రణయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అయితే తమ కులం కానివాడిని చేసుకుందని అప్పటి నుంచి మారుతిరావు ఈ జంటపై కక్ష్య పెంచుకున్నారు.  ఒకటీ రెండు సార్లు అమృత భర్త ప్రణయ్ ని చంపించడానికి ప్రయత్నించారు.  ఓ వ్యక్తికి భారీగా సుపారీ ఇచ్చి ప్రణయ్ ని చంపించాడు.   తన తండ్రిపై కేసు పెట్టింది. 

 

ఏడు నెలలపాటు జైలులోనే ఉన్న అతను బెయిల్‌పై బయటకు వచ్చి న తర్వాత మధ్యవర్తుల ద్వారా తన బిడ్డను ఇంటికి పిలిపించుకునేందుకు యత్నించాడు.  అందుకు అమృత అంగీకరించలేదు.   మొన్న హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్యా భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా మారుతిరావు మరణంపై ‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమారణ్ స్పందించారు.  ఈ కాలంలో కూడా కులం అనే రక్కిసి ఎంతో మంది ఉసురు తీసుకుంటుందని అన్నారు.  ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారి కులాలు ఒక్కటి కావన్న అక్కసుతో ప్రణయ్ హత్యకు కారణం అయ్యారు మారుతిరావు.

 

అమ్మాయి గర్భందాలిస్తే భర్త ఆమెని చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తే.. నడిరోడ్డు మీద నరికేశారని అన్నారు. చనిపోయే పదినిమిషాల ముందు ఆ జంట తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కని ఉంటారు.. వారి కలలు ఛిద్రం అయినట్టే కదా అన్నారు. అయితే దీనికి ప్రధాన కారణం కులం అని అన్నారు. నిజంగా తన కూతురు ఇష్టపడ్డవాడు మంచి వాడు కాదు అనుకుంటే అప్పుడే అడ్డు చెప్పాల్సింది.. తీరా పెళ్లై గర్భవతి అయిన తర్వాత తక్కువ కులానికి చెందినవాడని చంపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆనాడు అలా చేయకుండా ఈ నాడు మారుతిరావు ఇలా చనిపోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయ పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: