ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఈ సమ్మర్ లో వరుస రీమేక్ లు ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పరభాషా సినిమాలని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుండి మొదలుకుని, రామ్ పోతినేని రెడ్ మూవీ, బాహుబలి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వరకు దాదాపుగా నాలుగైదు చిత్రాలు రీమేక్ అవుతున్నాయి.

 

 

అయితే ఈ చిత్రాలన్నీ హిందీ నుండో, దక్షిణాది చిత్రాల నుండో రీమేక్ అవుతున్నవి. కానీ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొరియన్ సినిమాలని రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. గత ఏడాది కొరియన్ మూవీ అయిన మిస్ గ్రానీ సినిమాని తెలుగులో సమంత హీరోయిన్ గా ఓ బేబీ పేరుతో తెరకెక్కించి మంచి విజయం అందుకుకున్నాడూ. దాంతో అప్పటి నుండి సురేష్ బాబు దృష్టి కొరియన్ సినిమాలపై పడింది.

 

 

సుధీర్ వర్మ దర్శకత్వంలో మిడ్ నైట్ రన్నర్స్ అనే చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయనున్నాడట. ఇవే కాదు మరో పది చిత్రాల రీమేక్ రైట్స్ కూడా సురేష్ బాబు దగ్గర ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంటే దాదాపుగా డజనుకి పైగా కొరియన్ చిత్రాలని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. మరి సడెన్ గా సురేష్ బాబుకి కొరియన్ సినిమాల మీద ఇంత ఆసక్తి ఎందుకు కలిగిందో..

 

అయితే ఓ బేబీ ఫలితం బాగా రావడం వల్లే సురేష్ బాబు కొరియన్ సినిమాల వైపు చూస్తున్నాడని, అదీ గాక కొరియన్ థ్రిల్లర్స్ పై ఉండే సహజమైన ఇంట్రెస్ట్ కూడా రీమేక్ చేయడానికి అవకాశాన్ని ఇస్తుందని అంటున్నారు. మరి ఈ రీమేక్ లన్నీ ఓ బేబీ లా విజయం సాధిస్తాయా అన్నదే సందేహం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: