టాలీవుడ్ లో క్రేజీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.  ఫ్యాన్స్ ఈ క్రేజీ హీరోని రౌడీ హీరోగా పిలుచుకుంటారు.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ లో చిన్న పాత్రలో కనిపించి విజయ్ దేరకొవండ తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్ళిచూపులు’ సినిమాతో హీరోగా మారారు.  ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకోవడం మాత్రమే కాదు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.  ఈ మూవీలో విజయ్ దేవరకొండ బోల్డ్ యాక్టింగ్, డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.  ఇక పరుశరామ్ దర్శకత్వంలో గీతాగోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.  హర్రర్ జోనర్ లో వచ్చిన టాక్సీవాలాతో మరో విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. 

 

ఇలా వరుస విజయాలు అందుకుంటున్న ఈ కుర్ర హీరో ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో డిజాస్టర్ అందుకున్నాడు.  అయినా విజయ్ దేవరకొండ అంటే క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.. వరుస ఛాన్సులతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే నటిస్తుంది.  నేడు తెలుగు రాష్ట్రల్లో హూళీ సంబంరాలు జరుపుకుంటున్నారు. తాజాగా 2017 లో ప్రపంచ తెలుగు మహా సభలు వైభవంగా జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఈ సభల కోసం కొన్ని పాటలను ప్రత్యేకంగా తెరకెక్కించింది. అయితే వంశి పైడిపల్లి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ సాగే పాట, ఈ హోలీ సందర్భంగా మరోసారి వైరల్ అయింది. ఈ పాట రెండన్నరేళ్ల క్రితం చిత్రీకరించిన పాట అయినప్పటికీ విజయ్ దేవరకొండకు ఇప్పుడు ఉన్న క్రేజ్ కి  తెరపైకి రావడంతో రౌడీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: