ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ రంగం జెట్ స్పీడుతో అభివృద్ధి చెందుతోంది. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల తగ్గిపోతుండటంతో వెబ్‌ లోనే సినిమా క్వాలిటీ కంటెంట్‌ అందుబాటులోకి వస్తోంది. దీనికి తోడు వెబ్‌ రంగంలో సెన్సార్ కూడా లేకపోవటంతో బోల్డ్‌, సెక్సీ కంటెంట్‌ కూడా డిజిటల్‌ రంగంలో విపరీతంగా వస్తోంది. తాజాగా అలాంటి ఓ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ఉమెన్స్‌ డే కానుకగా ఎనౌన్స్‌ మెంట్‌ వచ్చింది.

 

అమెజాన్‌ ప్రైమ్‌లో సూపర్‌ హిట్ అయిన ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీస్‌ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ను ప్రకటించారు. ఈ సీజన్‌ ఏప్రిల్‌ 17న ప్రసారం కానుంది. ఇండియాతో పాటు దాదాపు 200 దేశాల్లో ఈ వెబ్‌ సిరీస్‌ అందుబాటులో రానుందని అమెజాన్‌ ప్రైమ్‌ వెల్లడించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎనౌన్స్‌ మెంట్‌తో పాటు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్‌. ప్రితీష్‌ నాండీ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ బ్యానర్‌లో రంగితా ప్రితీష్‌ నాండీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్‌ కామెడీ వెబ్‌ సిరీస్‌ కోసం అంతా మహిళా నటీనటులు, సాంకేతిక నిపుణులే ఎక్కువగా పనిచేశారు.

 

తొలి భాగం ఘనవిజయం సాధించటంతో ఆ సీజన్‌ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే రెండో సీజన్‌ను ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో ఫ్రీ లైఫ్‌కు అలవాటు పడిన మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న కథను స్పైసీగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. ఈ వెబ్‌ సిరీస్‌లో సయానీ గుప్తా, క్రితీ కుల్హరి, బానీ జే, మాన్వీ గుంగ్రూలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ప్రతీక్‌ బబ్బర్‌, లిసారే, మిలింద్ సోమన్‌ అమ్రితా పూరిలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవికా భగత్ రాసిన కథా కథనాలతో నుపుర్‌ ఆస్థానా ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: