హాస్య నటుడు, హీరో, టీవీ వ్యాఖ్యాత అలీ 1108 సినిమాలలో నటించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఘనతని సాధించాడు. ఐతే 1109 సినిమా లో అలీ, నియా హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ఆయన కూతురు కూడా ఓ పాత్రలో నటించడం చాలా ఆసక్తికరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలీ కూతురు పేరు బేబీ జువేరియా కాగా ఆమె నటిస్తున్న మొట్టమొదటి సినిమా శీర్షిక పేరు 'మా గంగానది'. దీనికి ఉపశీర్షిక 'అంత పవిత్రమైనది స్త్రీ' అని ఆ సినీ బృందం పెట్టారు. ఈ చిత్రానికి వి. బాల నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తుండగా... నిర్మాతలైన వి.నాగేశ్వ‌ర‌రావు, సూర్య‌వంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ కలిసి ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో మూగాంబికా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  తెరకెక్కిస్తున్నారు.




మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే మియాపూర్ లోని పిఎస్ఎస్ మహిళా ట్రస్ట్ భవన్ లో సినిమా హీరో అలీ, దర్శకుడు వి.బాల నాగేశ్వ‌ర‌రావు, పీఎస్ఎస్ నిర్వాహ‌కుడు డా.హెచ్‌.సి.శ్రీనివాస్ త‌దిత‌రులు నడుమ 'మా గంగానది' ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.




ఇకపోతే, మా గంగానది సినిమా ఆడవారిపై దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాల గురించి ఉంటుందని అలీ చెప్పాడు. అలాగే ఈ సినిమా దర్శకుడు బాల నాగేశ్వరరావు బాగా చదువుకున్నాడని, అతను ఒక అద్భుతమైన వ్యక్తి అని, ఆడవారికి సంబంధించిన చక్కని కథను రూపొందించాడని, ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే పిఎస్ఎస్ మహిళా ట్రస్టుకు ఏదైనా అవసరం వస్తే తన ట్రస్ట్ నుండి ఆర్థిక సాయం చేస్తానని మాట ఇచ్చాడు. సినీ దర్శకుడు బాల నాగేశ్వరరావు కూడా మాట్లాడుతూ... సమాజంలో జరుగుతున్న స్త్రీ సమస్యలపై రూపొందించిన చిత్రమిది. మా సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. మరి కథా బలం తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆడియన్స్ ఆదరిస్తారో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: