శివ కార్తికేయన్ గుర్తున్నాడా !!" రెమో’ సినిమా తో  హీరోగా తెలుగు  ప్రేక్షకులకి  పరిచయం అయ్యాడు.. అటు స్త్రీ వేషం ధరించి నర్స్ రూపంలో తళుక్కుమన్నాడు.ఇటు పురుషుడు రూపంలోను నటించాడు. ఒకే సినిమాలో రెండు పాత్రలు చేసి అందరిని మెప్పించాడు..స్వతహాగా శివకార్తికేయన్ తమిళ హీరో.కానీ రెమో  సినిమాలో శివకార్తికేయన్ నటనకు చాలా మంది తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. కానీ , ఆ తరవాత ‘సీమరాజా’గా వచ్చిన ఈ యంగ్ హీరో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయారు. స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఈ చిత్రం తమిళంలోనూ సరిగ్గా ఆడలేదు. అయితే, ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

 

 

తమిళ్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు..అయితే తమిళంలో  శివకార్తికేయన్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించారు.. ఈ సినిమాకి  ‘హీరో’ అనే టైటిల్ పెట్టి కిందటేడాది డిసెంబర్‌లో విడుదల చేసారు. ఇప్పుడు ఈ సినిమాను  తెలుగులోకి అనువాదం చేశారు. ఈ సినిమాకి టైటిల్ కూడా ఖరారు అయింది.. ఒకప్పుడు మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "శక్తి" సినిమా టైటిల్నే ఈ సినిమాకి కూడా పెట్టారు... తెలుగులో   ‘శక్తి’  అనే టైటిల్‌తో మార్చి 20న మనముందుకు రాబోతున్నాడు శివ కార్తికేయన్. తమిళ వెర్షన్ లో ఈ సినిమా విడుదలై సరిగ్గా మూడు నెలలు అవుతుంది.ఇప్పుడు  తెలుగులో ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రానికి  పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను సోమవారం (మార్చి 9న) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.

 

 

కాగా, ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్నారు. ఈయన ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, ఇవానా, రోబో శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సూపర్ హీరో మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా, ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక సోషల్ మెసేజ్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. చదువు, విద్యార్థులతో ముడిపడి ఉన్న కథ.చదువు కునే విద్యార్థుల గూర్చి, చదువుతో వ్యాపారం చేసే వల్ల అటకట్టించే శక్తిమాన్ లా మన ముందుకు రాబోతున్నాడు శివ కార్తికేయన్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: