చిరంజీవి డాన్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బాస్ స్టెప్పులేస్తే మ్రోతమోగి పోవాల్సిందే. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్, కామిడీ, టైమింగ్ అన్నింటిలోను చిరంజీవి నెంబర్ వన్నే. అప్పటి నుండి ఇప్పటి వరకు డాన్స్ని ఎంతో చక్కగా పర్ఫార్మ్ చేస్తూ వచ్చాడు. చిరంజీవి ఇన్ని సినిమాలు తీసాడంటే ఆ ట్యాలంట్ని మనం వర్ణించక్కర్లేదు. 

 


చాలా కాలం తర్వాత వచ్చినా ఆ ఊపు తగ్గలేదు. ఫ్యాన్స్లో ఆ జోష్ తరగలేదు. అంత గొప్ప నటుడు మన మెగాస్టార్. ఆ క్రేజ్ నిజంగా రావడానికి కారణం ఆయన స్టైల్, డాన్సే. చిరంజీవి తన 150 సినిమాలో కూడా డాన్స్ని చింపేసాడు. కొడుకుతో కలిసి అమ్మడూ లెట్స్ డు కుమ్ముడు అంటూ ప్రేక్షకులని ముగ్ధులు చేసేసాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు తన ట్యాలంట్ పెరిగిపోతోంది. ఇమేజ్ రెట్టింపు అవుతోంది. 

 


సైరా నరసిమ్హ రెడ్డి సినిమా తర్వాత రాబోయేది ఆచార్య సినిమా. ఆచర్య సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కొరటాల శివ చాలా మాస్ సినిమాలని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మాస్ డైరక్టెర్కి ఈ పెద్ద హీరో జతకడితే సినిమా సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ సినిమా ఊహ ఇప్పటికే మీకు అర్ధం అయ్యిపోయే ఉంటుంది. కానీ తాజాగా తెలిసిన సంగతి ఏమిటంటే అద్దిరిపోయే డాన్స్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారట. రెజీనా చెప్పిన మాట ప్రకారం తెలియనుంది. 

 

ఆమె ఆరు రోజుల పాటు సాంగ్ని చెయ్యాలి అని షేర్ చేసుకుందట. మరి అర్ధం అయ్యిపోలే ఆ డాన్స్ ఏ స్థాయిలో ఉండనుందో. మెగాస్టార్ కనుకనే ఒప్పుకుందట రెజీనా. శేఖర్ మాస్టార్ ఈ పాటకి కంపోజ్ చెయ్యనున్నాడట. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేనట్టు సమాచారం. ఏది ఏమైనా మెగాస్టార్ రప్ఫాడించడం ఖచ్చితం అన్నట్లు ఆశతో ఉన్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: