టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు తనదైన వెరెటీ ట్విట్స్ తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.  సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందినవారిపై ఎప్పుడూ ఏదో ఒక ట్విట్స్ పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంటారు.  ఈ మద్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనాపై కూడా తనదైన వెరైటీ ట్విట్స్ చేస్తున్నారు.  కరోనా నువ్వు ఒక పరాన్న జీవివి.. నువ్ కూడా చచ్చిపోతావ్.. అంటూ కరోనాపై సెటైర్లు వేశారు.  అంతే కాదు చైనాలో బార్బర్ షాప్ లో ఇలా కటింగ్ చేస్తున్నారంటూ మరో ట్విట్ పోస్ట్ చేశారు.  ఇక నిన్న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన మహిళా దినోత్సవం సందర్భంగా అంటే కాస్త లేట్ గా ఓ విచిత్రమైన ట్విట్ చేశారు.

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాయిస్ అసిస్టెంట్ యాప్ అలెక్సాకు శుభకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం మార్చి 8న అయితే, తాను కాస్త ఆలస్యంగా 9వ తేదీన విషెస్ తెలియజేస్తున్నందుకు అలెక్సాకు సారీ కూడా చెప్పారు. 'వాస్తవానికి నువ్వు సిరి కంటే చాలా ఉత్తమం, అయితే ఈ విషయం సిరికి చెప్పొద్దు సుమా!' అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. గతంలో పిల్ వాయిస్ అసిస్టెంట్ యాప్ సిరికి కూడా మహిళా దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.

 

ఈ యాప్స్ మహిళా వాయిస్ తో వస్తుంటాయి.. మనం ఏది అడిగితే వాటికి సమాధానం ఇస్తూ ప్లే చేస్తుంటాయి. ఈ సందర్భంగా వర్మ 'నాకు తెలిసినంతవరకు ఎలాంటి గొడవ చెయ్యని ఏకైక మహిళవి నువ్వే సిరి' అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అలెక్సా, సిరి యాప్ లు మహిళల గొంతుకతో వినియోగదారులకు సేవలు అందిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ రెండింటిని మహిళలతో పోల్చి వర్మ శుభాకాంక్షలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: