చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన క‌రోనా లేదా కోవిడ్‌-19 వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్నే వ‌ణికిస్తోంది. ఈ కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. అయితే ఈ క‌రోనా వైర‌స్‌నే భ‌య‌పెడుతున్నాడు బాలీవుడ్ హీరో, హీరోయిన్లు టైగర్ ష్రాఫ్. యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అనే ట్యాగ్ తో బాలీవుడ్ తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్న టైగర్ ష్రాఫ్. భాగీ సీక్వెల్స్ తో ఆడియెన్స్ మంచి కిక్కుస్తున ఈ కండలవీరుడు మూడవ సీక్వెల్‌లో యాక్షన్ డోస్ మరింత పెంచి భాగీ 3 అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

 

ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది.  శుక్రవారం తొలిరోజు రూ. 17.50 కోట్లు రాబట్టిన భాగీ 3 రెండవరోజు రూ. 16.03 కోట్లు, ఆదివారం రూ. 20.3 కోట్లను వసూలు చేసి మూడు రోజుల్లో మొత్తం రూ 53.83 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్ తెలిపారు. అయితే ఓ వైపు దేశంలో కరోనా వైరస్‌ ప్రబలుతుండటంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే అవేవీ పట్టించుకోకండా బరిలో దిగిన భాగీ3 పై కరోనా ప్రభావం ఎంతమాత్రం లేదని ఈ వ‌సూళ్లు చూస్తేనే అర్థం అవుతోంది.

 

అలాగే మాస్‌ సెంటర్లలో ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతోందని, మెట్రోల్లోనూ మూడోరోజు పుంజుకుందని తెలుస్తోంది. కాగా, భాగీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజైంది. భారత్‌లో 4500 థియేటర్లలో, ఓవర్సీస్‌లో 1100 థియేటర్లలో కలిపి ప్రపంచవ్యాప్తంగా 5600 థియేటర్లలో రిలీజైంది. భారీ ఎత్తున్న ఎక్కువ సంఖ్యలో సినిమా రిలీజ్ కావడం టైగర్ ష్రాఫ్‌కు బాగా క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. మ‌రియు జేమ్స్‌బాండ్ సిరీస్‌లో డేనియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై సినిమా రిలీజ్ కూడా వాయిదా పడటం భాగీ సినిమాకు కలిసొచ్చింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: