బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు తెలుగు రీమేక్ గా వస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం తో రెండేళ్ల గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఇటీవల విడుదలైన మొదటి లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా ఈసినిమా నుండి విడుదలైన మొదటి సాంగ్ మగువ మగువ యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కేవలం 48 గంటల్లో ఈ సాంగ్ 450k లైకులను రాబట్టి టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో అత్యధిక లైకులను సొంతం చేసుకున్న మొదటి తెలుగు సాంగ్ గా రికార్డు సృష్టించింది.
 
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా టీజర్ కూడా విడుదలకానుంది. ఉగాది ముందు రోజు మార్చి 24న వకీల్ సాబ్ టీజర్ ను విడుదలచేయనున్నారని సమాచారం. ఫస్ట్ లుక్ , సాంగే ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకుంటే మరి టీజర్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. త్వరలో ఈటీజర్ విడుదల పై అధికారిక ప్రకటన వెలుబడనుంది.సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్నఈ చిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మేలో విడుదలకానుంది. ఇక వకీల్ సాబ్ తో  పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన 27వ చిత్రంలో నటించడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: