ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ ధాటికి మనుషులే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతుంది.  కరోనా వల్ల ప్రపంచంలో ఇప్పటి వరకు మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.  90 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తుంది.  అయితే కరోనా గురించి ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. దానికి ఇప్పటి వరకు యాంటీ డోస్ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.  ఈ వైరస్ రోజు రోజుకీ పెరిగిపోతుంది.. మరణాలు కూడా సంబవిస్తున్నాయి. అయితే కరోనా వల్ల సినీ పరిశ్రమ కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.  ఇప్పటికే చాలా షూటింగ్స్ క్యాన్సల్ చేసుకుంటున్నారు.  జేమ్స్ బాండ్, మిషిన్ ఇంపాసిబుల్ లాంటి హాలీవుడ్ లో మూవీస్ కి కరెనా ఎఫెక్ట్ పడింది.

 

ఈ మద్య రజినీకాంత్ నటిస్తున్న మూవీ సైతం కరోనా భయంతో షూటింగ్ క్యాన్సల్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా కరోనాతో ఇంతగా భయపడుతున్నప్పటికీ అజిత్ నటిస్తున్న ‘వాలిమై' విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ  బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి వినోద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.  ఇప్పటికే కొంత షెడ్యూలో పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో తదుపరి షెడ్యూల్ ను 'స్పెయిన్' .. 'మొరాకో'లలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.

 

అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా ఎఫెక్ట్ వల్ల విదేశీ ప్రయాణాలు చేయడం మంచిది కాదు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఓ భారీ యాక్షన్ సీన్లు ప్లాన్ చేయాలన్నది దర్శక, నిర్మాతల ఉద్దేశ్యం.  కరోనా ఎఫెక్ట్ వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ,  ముందుగా అనుకున్న ప్రకారమే ఆయా ప్రాంతాల్లో షూటింగ్ జరపాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో అక్కడ షూటింగ్ జరపడానికి సిద్ధమవుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: