ఒకప్పుడు మితి మీరిన లిప్ లాక్ సీన్లు  కనిపించేవి. కానీ ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో కూడా ఈ మోజు పెరిగింది. అయితే నాకు లిప్ లాక్ అంటే తెలీదన్న మల్లు హీరోయిన్  రమ్యా నంభీశన్. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో కన్నా బాలీవుడ్ సినిమాల్లోనే లిప్ లాక్ సీన్లు ఎక్కువ. శ్రుతి మించిన బోల్డ్ సన్నివేశాలు మన దక్షినాది సినిమాలలో ఎక్కడా చూపించరు. అందులో మలయాళ చిత్ర పరిశ్రమలో అయితే లిప్ లాక్ సీన్ తీయాలంటే ఆలోచిస్తారు. 2011 లో వచ్చిన 'చప్ప కురీషు' అనే సినిమాలో ఫాహిద్  ఫాసిల్, రమ్యా నంబీశన్ జంటగా నటించారు. 

 

ఈ సినిమాలో బోల్డ్ లిప్ లాక్ సీన్లు చాలానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయినా ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే దానికి కారణం ఈ  లిప్ లాక్  సీన్ల వల్లే. అయితే ఈ సీన్ల గురించి  ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు రమ్య  మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిజాయితీగా చెప్పాలంటే  అప్పట్లో  నాకు లిప్ లాక్ అంటే ఏమిటో  తెలీదని ఆమె అమాయకంగా చెప్పింది. నా జీవితం లో ఎవరిని కిస్ చేయలేదని చెప్పారు. మొదటి సారి ఆ సినిమాలో హీరో నే ముద్దు పెట్టుకున్నాను అని అన్నారు. 

 

నా దర్శకుడు మొదటి గా లిప్ లాక్ సీన్ గురించి చెప్పగానే నాకు ఆ పదానికి అర్థం కూడా తెలీదు అని చెప్పా. ఇది నమ్మరు కానీ ఇదే నిజం. అయితే డైరెక్టర్ మాత్రం  ఆ సన్నివేశాన్ని ఎలాగైనా తెరకెక్కించాలని అనుకున్నారని ఆమె వివరించింది. అయితే సినిమా కమర్షియల్ గా ఉండాలి అంటే మాత్రం కచ్చితంగా లిప్ లాక్ సీన్ లు ఉండే విధంగా చూస్తున్నారు దర్శకులు. ఈ మధ్య హీరోయిన్లు లిప్ లాక్ సీన్స్ విషయంలో కాస్త దూకుడుగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: