తల్లిదండ్రులు అంటే ఎవరు? పిల్లలను కనేసి వెళ్లిపోయే వారు కాదు.. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే వారే తల్లిదండ్రులు. ఈ విషయం అందరికి తెలుసు.. అయితే ఇలాంటి తల్లిదండ్రులు సినిమాలలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కనిపించిన వారు అంత నిజమైన తల్లిదండ్రులు అని అనిపించారు.. అనిపించేలా వారు నటించారు. 

 

కానీ వెంకటేష్ మాత్రం అసలు సిసలైన తండ్రిలా.. కుటుంబం కోసం ఏమైనా చేసే తండ్రిగా జీవించేశాడు.. ఆ సినిమా ఏదో కాదు.. మీ అందరికి తెలిసిన సినిమానే.. దృశ్యం సినిమా. ఆ సినిమాలో ఒక అబ్బాయి కారణంగా ఒక కుటుంబం అంత కష్టాల్లో పడుతుంది. ఆ కష్టాలు చుసిన ప్రతి కుటుంబం వారికీ కలిగినంత బాధ వేసింది. 

 

ఇంకా ఆ సినిమాలో వెంకటేష్ కూతురును ఒకడు బెదిరిస్తే ఆ బెదిరించిన వాడు ఇంటివరుకు వస్తే.. తల్లి మీనాను ఒక మాట అన్నాడు అని కూతురు రాడ్డుతో కొడుతుంది. ఆ అబ్బాయి చనిపోవడంతో ఇంకా ఆ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి. తండ్రి సినిమా తెలివితో కుటుంబాన్ని కాపాడేస్తాడు.. 

 

ఇంకా ఆ సినిమాలో తల్లిదండ్రులుగా మీనా, వెంకటేష్ జీవించేసారు అనే చెప్పాలి.. వాళ్ళ ఇద్దరినీ చూస్తే నిజమైన తల్లితండ్రుగా కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఆ సినిమా ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. మరి ఈ పెయిర్ మళ్లీ కలిసి ఎప్పుడు నటిస్తుందో చూడాలి. ఎంతైనా ఈ ఓల్డ్ జంట ఎప్పటికైనా ఎవరు గ్రీన్ ఏ. 

 

ఈ ఓల్డ్ జంట ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కొడుకు కోడలుగా కూడా వీరు నటనలో అదరగొట్టారు. ఎప్పుడు కూడా వీళ్ళ జంట అదుర్స్ ఏ. అలాంటి ఈ జంట దృశ్యంలో నటించిన తీరు ఇంకా సూపర్. తల్లితండ్రులుగా ఇరగదీశారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: