టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుస విజయాలను సొంతం చేసుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు మహేష్ బాబు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తు  బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబు మాత్రం కాస్త డిఫరెంట్. మహేష్ బాబు ఏం చేసినా సంచలనం గానే మారుతూ ఉంటుంది. ఇక వరుస విజయాలతో మహేష్ బాబు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే చాలా మంది హీరోలు కేవలం సినిమాల్లోనే కాదు అటు... యాడ్స్ లో  కూడా నటిస్తూ  సంపాదిస్తూ ఉంటారు. 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా రెండు చేతులా రా ఫుల్లుగా సంపాదిస్తున్న హీరోల్లో మహేష్ బాబు ముందుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ యాడ్  లో చూసిన మహేష్ బాబే కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా సీరియల్స్ ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఓ వైపు సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటూనే మరోవైపు... ఎన్నో యాడ్స్  లో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. ఏకంగా ప్రస్తుతం మహేష్ బాబు చేతిలో 22 ఎండోర్స్ మెంట్స్ ఉన్నాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబు క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 

 

 

 ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు సైతం మహేష్ బాబు తో యాడ్  చేయించుకోవాలని ఆరాటపడుతుంటారు. అంతేకాదు మహేష్ అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు. కేవలం ఒక్కటేమిటి అన్నీ యాడ్స్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు తో యాడ్  చేస్తే అటు ప్రేక్షకుల్లోకి  కూడా బాగా వెళ్తుందని కంపెనీలు నమ్ముతున్నాను. అందుకే టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్న మహేష్ బాబు నే  కావాలి అనుకుంటున్నారూ. ఇక తాజాగా మరో యాడ్ కూడా మహేష్ బాబు ఖాతాలో చేరిపోయింది. కార్ దేకో  యాడ్ కూడా మహేష్ బాబు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదండోయ్ ఓ  బిజినెస్ కూడా మహేష్ బాబు  మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే మహేష్ బాబు క్లాతింగ్ రంగంలో రాణిస్తున్నారు. ఏదేమైనా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు యాడ్స్ లో కూడా సరిలేరు నీకెవ్వరు అని నిరూపిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: