తమ ఫేవరెట్ హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తే పండగ చేసుకుంటారు. ఇలా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వడానికికెరీర్ లో ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు రామ్. ఈ యంగ్ స్టార్ తో పాటు తమకు కలిసొచ్చిన ఈ డ్యూయల్ రోల్ ఫార్ములాని ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నారు మరికొంత మంది హీరోలు.

 

 

ఇన్నేళ్ల కెరీర్ లో రామ్ క్లాస్ మాస్ యాక్షన్ ఇలా డిఫరెంట్ జానర్స్  ట్రై చేశాడు. కానీ డ్యూయల్ రోల్ మాత్రం ఇప్పటి వరకూ టచ్ చెయ్యలేదు. ఈ మద్య ఇస్మార్ట్ శంకర్ తో పక్కా మాస్ ఫెలో గా కనిపించి  ఫుల్ గా ఫామ్ లోకొచ్చిన రామ్ మరో ఎక్స్ పెరిమెంట్ కి రెడీ అయ్యాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తమిళ్ లో హిట్ అయిన తడమ్ కు రీమేక్ గా రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో డ్యూయల్ రోల్ లో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతున్నాడు. 

 

 

ప్రభాస్ కూడా కెరీర్ లో  డ్యూయల్ రోల్స్ లో కనిపించాడు .  చాలా కాలం తర్వాత మళ్లీ జాన్ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీలో డబుల్ రోల్ లో కనిపించి ఎంటర్ టైన్ చేస్తాడట ప్రభాస్. ప్రభాస్ అంతకుముందు బిల్లా సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడు. 

 

 

బాలకృష్ణ కూడా మరో సారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మొన్నీమద్యనే రూలర్ లో డిఫరెంట్ షేడ్స్ చూపించిన బాలయ్య.. ఇప్పుడు బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు.  కెరీర్ లో నాని కూడా డ్యూయల్ రోల్ ట్రై చేశాడు. జెంటిల్ మెన్ లాంటి సినిమాల్లో వర్కవుట్ అయ్యింది కూడా . ఇప్పుడు ఇదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్నాడు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్యన్ తో నాని చెయ్యబోతున్న శ్యామ్ సింగరాయ్ లో డ్యూయల్ రోల్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. సో .. ఇలా తమలోని మల్టిపుల్ యాక్టింగ్ లో షేడ్స్ మరో సారి డ్యూయల్ రోల్ లో చూపించి ఆడియన్స్ కి డబుల్ కిక్ ఇవ్వబోతున్నారు హీరోలు .

మరింత సమాచారం తెలుసుకోండి: