ఎన్నాళ్లని ఇక్కడే ఉంటాం. కొత్తగా ఆలోచించాలి అందుకే తెలుగు డైరెక్టర్లకు రీజనల్ సినిమా ఇమేజ్ బోర్ కొట్టేసింది. లోకల్ సినిమా స్టేజ్ దాటిపోయాం.  ప్యాన్ ఇండియా లెవల్ కిక్ ఇవ్వడం లేదు. అందుకే .. ప్యాన్ వరల్డ్ లెవల్ కి వచ్చేశాం. తెలుగు సినిమా రేంజ్ ప్యాన్ వరల్డ్ కి పెరిగిపోయింది. ఇప్పుడు అందరూ ప్యాన్ ఇండియా వదిలేసి ప్యాన్ వరల్డ్ సినిమాల మీదే ఇంట్రస్ట్ చూపిస్తూ...థింక్ బిగ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు తెలుగు డైరెక్టర్లు . 

 

 

తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే జస్ట్ టాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ అయ్యేది. తర్వాత సౌత్ లో తమిళ్, మళయాళంలో కూడా రిలీజ్ అవుతుండేది. బాహుబలి రావడంతో టాలీవుడ్  స్టేచర్ , తెలుగు సినిమా స్టామినా ప్యాన్ ఇండియా అయ్యింది. ఇప్పుడు అది కూడా దాటిపోయాం. ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ లెవల్లో తెలుగు సినిమా స్ప్రెడ్ అయిపోయింది. ప్రజెంట్ తెరకెక్కుతున్న చాలా సినిమాలు లోకల్ సినిమా ట్యాగ్  వదిలేసి ప్యాన్ ఇండియా లెవల్లోనే వస్తున్నాయి.   

 

 

తెలుగు సినిమా ఇప్పటివరకూ ప్యాన్ ఇండియా లెవల్ సినిమాలు చేసింది. ఇప్పుడొస్తున్న ప్రతి సినమాకు ప్యాన్ ఇండియా లెవల్ అలవాటైపోయింది.  బట్.. ఆ హ్యాపీనెస్ సరిపోవడం లేదు తెలుగు డైరెక్టర్లకి. అందుకే ప్యాన్ వరల్డ్ మూవీస్ అంటున్నారు. ఇలా తెలుగు సినిమాని ప్యాన్ వరల్డ్ లెవల్లో చేస్తానంటున్నాడు డైరెక్టర్ నాగాశ్విన్. తెలుగు సినిమాని ప్యాన్ ఇండియా సినిమా లెవల్ కి  రీచ్ అయ్యేలా చేసిన తెలుగు హీరో ప్రభాస్. రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి ఇండియాతో పాటు.. చైనా జపాన్ లో కూడా డబ్ అయ్యి రిలీజైంది. వరల్డ్ వైడ్ గా 2500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న ప్రభాస్ ని హీరోగా పెట్టి ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తానని అనౌన్స్ చేశాడు నాగాశ్విన్.  మహానటితో నేషన్ వైడ్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ నాగాశ్విన్ వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ లో ప్రభాస్ తో ప్యాన్ వరల్డ్ సినిమా ఈ ఇయర్ ఎండ్ కి స్టార్ట్ చేస్తున్నాడు. 

 

ప్రభాస్ మరో సినిమా జాన్ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. విలేజ్, సిటీ లెవల్ ప్రేమను దాటి... యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో తమ ప్రేమను అక్కడే తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమా భారీ సెట్స్ తో ప్రభాస్ రేంజ్ యాక్షన్ , దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో  ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఎందుకంటే ..ఇప్పుడు ప్రభాస్ కు ప్యాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. 

 

 

టాలీవుడ్ లో  బాహుబలి, సాహో, సైరా ల కంటే హై ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అవ్వబోతున్న మరో ప్యాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ . 400 కోట్ల భారీ బడ్జెట్  కాకుండా.. బాలీవుడ్ హాలీవుడ్ భారీ స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాకి ఇంకాస్త భారీ తనాన్ని తెచ్చిపెట్టింది. చరణ్, ఎన్టీఆర్ కలిసి ఈ మల్టీ స్టారర్ చేస్తున్న ఈ సినిమా రాజమౌళి డైరెక్షన్ కాబట్టి.. వరల్డ్ వైడ్ గా ఈ డైరెక్టర్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా కూడా వరల్డ్ లో ఇతర భాషల్లో రిలీజ్ అయ్యే ఛాన్సుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ .

 

 

ఇప్పుడొస్తున్న  తెలుగు సినిమాల్లో  చాలా వరకూ ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నారు. స్టార్లు కూడా ఆ సినిమాలతో తమ మార్కెట్ స్ప్రెడ్ చేస్కోడానికి ట్రై చేస్తున్నారు. మొన్న మొన్నటివరకూ తెలుగులోనే సినిమాలు చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు జస్ట్ సౌత్ హీరో అనిపించుకోవడానికి ఇష్టపడట్లేదు . అందుకే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పూరీ డైరెక్షన్లో కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్  కంబైన్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ ఫైటర్ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఇలా ఇప్పుడు తెలుగు డైరెక్టర్లు లోకల్ సినిమాని పక్కన పెట్టి టాలీవుడ్ రేంజ్ పెంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: