టాలీవుడ్ ఇండస్ట్రీలో 'లక్ష్మీ కళ్యాణం' సినిమా తో ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్రహీరోలతో అందరితో పక్కన హీరోయిన్ గా నటించి భారీ భారీ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

 

సౌత్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇతర భాషల్లో నటించి విజయ్ హీరోయిన్ అయినా కాజల్...బాలీవుడ్ ఇండస్ట్రీ పై మోజు పడింది. దీంతో సౌత్ ఇండస్ట్రీ ని చాలా లైట్ తీసుకుని...సౌత్లో సినిమా అవకాశాలు వచ్చిన వద్దనుకుని బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే సెటిల్ అయిపోతాను అన్న భావనలో సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడే విధంగా అప్పట్లో వ్యవహరించింది. ఆ తర్వాత అనుకోకుండా మాట్లాడినట్లు ఆమె తెలిపింది.

 

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ వైపు అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే సెకండ్ టైం ఎంట్రీ లో పెద్దగా అవకాశాలు దక్కించుకొని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేస్తున్న పెద్ద సినిమా ‘ఇండియన్ 2’. ఇది కాకుండా మిగిలినవన్నీ సెకండ్ ప్లేస్ లో ఉన్న లీడ్ హీరోస్ తో చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ గా నటించనుందట.

 

వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య తెలుగులో పొరుగు రాష్ట్రాల రీమేక్ ల కంటే కొరియన్ రీమేక్స్ ఎక్కువ అయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కొరియన్ ‘డాన్సింగ్ క్వీన్’ అనే మూవీని రీమేక్ చేయడానికి రైట్స్ తీసుకున్నాడు. ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ గా అల్లరి నరేష్కాజల్ అగర్వాల్ లను అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో తన మేనేజర్ ఒప్పుకోకపోయినా అల్లరి నరేష్ తో సినిమా చేయడానికి కాజల్ అగర్వాల్ ఒప్పుకుని రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: