టాలీవుడ్ లో అక్కినేని కోడలు  సమంతా కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హిట్టు  ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక అక్కినేని కోడలిగా మారిన తరువాత ఈ అమ్మడి అదృష్టం బాగా కలిసి వచ్చింది చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అంతేకాకుండా  లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది సమంత. అయితే తాజాగా సమంత స్టార్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత కష్టపడినా ప్రేక్షకులకు నచ్చదు  సూటిగానే చెప్పుకొచ్చింది ఏమైంది. ఏదో ఒక సినిమా హిట్ అయితే అదే పనిగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు అటువైపు కూడా చూడరు అని చెప్పేసింది.

 

 

 హీరోయిన్ లు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాదని...  అదే స్టార్ హీరో అలా నడుచుకుంటూ వస్తే చాలు ఆడియెన్స్ పిచ్చెక్కిపోతున్నారు. స్టార్ హీరోలకు వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ వారికి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గదని...  అదే హీరోయిన్ వరుస ఫ్లాపులు వస్తే మాత్రం అవకాశాలు తగ్గి అసలు సినిమాలే లేకుండా పోతాయి అంటూ తెలిపింది . తన విషయానికి వచ్చినా  లేడి ఓరియెంటెడ్ గా చేసిన ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ అదే తరహాలో మళ్లీ ఇంకొన్ని సినిమాలు చేస్తే విజయం సాధిస్తుందో లేదో అని గ్యారంటీ కూడా లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ అక్కినేని వారి కోడలు. 

 

 

 

 సౌత్ ఇండస్ట్రీలో హీరోలకు ఉండే అట్రాక్షన్ హీరోయిన్లకి కనీసం ఒక్క శాతం కూడా ఉండదు అంటూ తేల్చి చెప్పింది. అయితే ఈ అమ్మడి మాటలు  అందరినీ షాక్ కి గురి చేసిన... సమంత చెప్పింది మాత్రం నిజమే అంటున్నారు చాలామంది. ఎందుకంటే ఇండస్ట్రీలో  హీరోయిన్స్ ఎంత కష్టపడినా... ఎంత అందాలను ఒలకబోసిన ఎంత బాగా నటించినా... హీరోలతో సమానమైన గుర్తింపు మాత్రం దొరకదు. పారితోషకం  విషయంలో కూడా హీరోహీరోయిన్ల మధ్య వ్యత్యాసం ఆకాశానికి భూమికి  మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది అంటూ అక్కినేని వారి కోడలు సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా హీరోలు తమ స్వార్ధంతో ఇమేజ్ తో బాగా కలెక్షన్లు తీసుకొస్తున్నప్పుడు అంత పారితోషికం తీసుకోవడంలో తప్పేమీ లేదు అంటూ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: