ప్రస్తుతం టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమాని ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేస్తున్నామని కొన్నాళ్ల క్రితం సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటికి మరింత సమయం పడుతుందని భావించి, ఎట్టకేలకు సినిమాని పోస్ట్ పోన్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు. 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా బడా నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని కీలక ఘట్టాల షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఇద్దరు హీరోల్లో ఎవరి పాత్ర పెద్దది, ఎవరి పాత్ర నిడివి ఎంత ఉంటుంది అనే విషయమై మన తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమా ప్రారంభం నుండి ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. 

 

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే సినిమాలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని, అయితే వారి పాత్రల తీరుని బట్టి సందర్భానుసారం ఒకరి తరువాత మరొకరి సీన్స్ వస్తూ వెళుతూ ఉంటాయని, అయితే ఇద్దరూ కలిసి నటించే కొన్ని కీలక సీన్స్ లో ఒకరిని మించేలా మరొకరు ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారని అంటున్నారు. బాహుబలి సినిమాల తరువాత రాజమౌళి తీస్తున్న భారీ సినిమా కావడంతో దీనిపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో, ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: