మాళ‌విక శ‌ర్మ మొద‌టి చిత్రంతోనే కుర్ర‌కారుకి హీటు పుట్టించిన ఈ భామ గ‌తంలో ర‌వితేజ స‌ర‌స‌న నేల‌టికెట్టు చిత్రంలో న‌టించింది.  ప్ర‌స్తుతం ఈ భామ  హీరో రామ్ స‌ర‌స‌న‌`రెడ్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇలా ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు రెగ్యుల‌ర్‌గా నాంప‌ల్లి క్రిమిన‌ల్ కోర్టుకి హాజ‌ర‌వుతుంది ఈ బ్యూటీ. అదేమిటి కోర్టుకు వెళ్ళ‌డం అనుకుంటున్నారా...ఎందుకంటే ఈమె లా స్టూడెంట్‌. ప్ర‌స్తుతం ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతోంది.

 

చదువులో భాగంగానే చివరి సంవత్సరం సీనియర్ లాయర్ వద్ద ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ క్రిమినల్ లాయర్ వద్ద ఇంటర్న్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా అంటే... షూటింగ్ లేనప్పుడల్లా కోర్టుకు వెళుతోంది. ఇది పూర్తవగానే పరీక్షలు ఉంటాయని, అవి ముగిస్తే తాను లాయర్ అవుతానని, అప్పుడు నేరుగా కేసులు టేకప్ చేస్తానని అంటోంది. మొత్తానికి ఇక‌సినిమాతో బిజీగా ఉన్నా కూడా చదువును కొనసాగిస్తూ భేష్ అనిపించుకుంటోంది మాళవిక.

 

మ‌రికొంత మంది హీరోయిన్లు అయితే...ఇలాంటి రంగంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఇంక చ‌దువు పైన ఆశ‌క్తిని చూపించ‌డం అనేది కాస్త క‌ష్ట‌మే. కానీ ఈమె రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ బాగానే చ‌దువుతుంది.  మ‌రికొంత అయితే ఏకంగా చ‌దువుకి ఫుల్‌స్టాప్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంత‌కీ ఈ భామ ఫ్యూచ‌ర్‌లో హీరోయిన్‌గా ఉంట‌దా లేక త‌న చ‌దువుకి న్యాయం చేస్తూ లాయ‌ర్ ప‌ట్టా ప‌ట్టుకుని కేసుల్ని వాదిస్త‌దా ష్యూచ‌ర్ ప్లాన్స్ ఏంటి అన్న‌ది ఇంకా తెలియ‌దు. ఇక‌పోతే ఛాన్సులు ఉన్నంత వ‌ర‌కు హీరోయిన్‌గా చేసినా ఆపై ఎలాంటి టెన్ష‌న్స్‌లేకుండా చ‌క్క‌గా కేసులు వాదించుకోవ‌చ్చ‌ని గ‌ట్టి ప్లాన్ చేసింది ఈ భామ‌. ఇక ఈ మూవీ గ‌నుక స‌క్సెస్ కొడితే ఇంకా మంచి మంచి అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్స్‌చాలానే ఉంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌కి కాస్త హీరోయిన్ల కొర‌త ఉంది. ఎక్కువ‌గా చూసిన హీరోయిన్ల‌నే చూడాల్సి వ‌స్తుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులుకాస్త బోర్‌ఫీల‌వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: