ఒక‌ప్పుడు సినిమాల్లో హీరోయిన్లు అంటే కేవ‌లం హీరోయిన్ పాత్ర‌ల‌కే ప‌రిమిత మ‌య్యేవారు. వారి పాత్ర ఏంటి అంత వ‌ర‌కే న‌టించేవారు. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది హీరోయిన్లు కూడా ఐటెమ్ సాంగ్స్ చేసేస్తున్నారు. ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే సినిమాలో ఐటెమ్ సాంగ్ ఒక ఎత్తు అని చెప్పాలి. ఐటెమ్ సాంగ్ లేని సినిమాలు అస‌లు ఉండ‌డం లేదు. ఇక రెగ్యుల‌ర్‌గా సినిమాలకు తీసుకునే రెమ్యూన‌రేష‌న్ ఒక‌లా ఉంటే ఐటెమ్ కోసం తీసుకునే రెమ్యూన‌రేష‌న్ టాప్‌లేపే రేంజ్‌లో తీసుకుంటున్నారు నేటి భామ‌లు. ఇక ఈ రోజుల్లో ఐటెమ్‌సాంగ్స్ కోసం ప్ర‌త్యేకంగా ఐటెమ్ గ‌ర్ల్స్ ఎవ్వ‌రూ ఉండ‌డం లేదు. ఒకప్పుడు జ‌య‌మాలిని, జ్యోతిల‌క్ష్మి, సిల్క్‌స్మిత, మొమైత్ ఖాన్ ఇలాంటి వారు ఇప్పుడు ప్ర‌త్యేకించి ఉండ‌డం లేదు. మొత్తం దేనికైనా రెఢీ అంటున్నారు నేటి హీరోయిన్లు.

 

టాలీవుడ్ అందాల రాశి పూజా హెగ్డే. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది ఈ భామ‌. కేవ‌లం టాలీవుడ్‌కి మాత్రమే ప‌రిమితం అవ్వ‌కుండా కోలీవుడ్, బాలీవుడ్‌, శాండిల్‌వుడ్ నుంచి కూడా ఈమెకు ఆఫ‌ర్ల వ‌ర్షం కురుస్తోంది. మొద‌ట్లో ఈమెను అంద‌రూ ఐరెన్ లెగ్ అనేవారు. ఇప్పుడు ఈమె లేనిదే సినిమాలు తీయ‌డం లేదు. ఏ సినిమాలో చూసినా పూజానే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే... ఈ భామ సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా ఐటెమ్‌సాంగ్స్‌తో అద‌ర‌గొట్టేస్తోంది. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` చిత్రంలో `జిల్ జిల్ జిల్ జిగేలురాణి` అంటూ రంగ‌స్థ‌లాన్ని మొత్తం ఓ ఊపు ఊపేసింది ఈ భామ‌.

 

అది సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ పాట ఒక ఎత్తు అయింది. ఆ పాట చూసేందుకే చాలా మంది సినిమాకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు.  ఆ పాట‌లో జిగేల్‌రాణి చూపించే అందాలు కుర్రాళ్ళ‌క‌ళ్ళు జిగేలు అన్నాయి. ఇక ఇటీవ‌లె ఈ భామ బాలీవుడ్ మూవీ `హౌస్‌ఫుల్‌` చిత్రం ఫుల్ క‌లెక్ష‌న్లు సాధించింది. అలాగే బ‌న్నీతో క‌లిసి న‌టించిన `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రం కూడా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. ప్ర‌స్తుతం హిట్ల మీద హిట్లు సాధిస్తూ మంచి  ఊపుమీద ఉంది ఈ జిగేల్ రాణి.

మరింత సమాచారం తెలుసుకోండి: