టాలెంట్ ఉంటే ఎవరు ఏదైనా చేయొచ్చు.. పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత ఫలనుమా దాస్ తో నటుడిగా టర్న్ అయ్యి.. మీకు మాత్రమె చెప్తా సినిమాతో హీరోగా ప్రయత్నించిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు కొత్తగా టివి హోస్ట్ గా సర్ ప్రైజ్ చేస్తున్నాడు. అతను హీరోగా చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమా లాంటి టైటిల్ తోనే నీకు మాత్రం చెప్తా అంటూ ఈటివి ప్లస్ లో ఒక షో రాబోతుంది. ఈ షోకి హోస్ట్ గా తరుణ్ భాస్కర్ దర్శనమివ్వనున్నాడు.

 

ముందు దర్శకుడిగా తన టాలెంట్ చూపించి సూపర్ అనిపించుకున్న తరుణ్ భాస్కర్ నటుడిగా మారి ఆహా ఇంతలో ఈ టాలెంట్ కూడా ఉందా అనిపించాడు. ఇక విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చేయాల్సిన వన్ని చేస్తూ ఏమి తెలియని అమాయకుడిగా తరుణ్ భాస్కర్ నటన బాగుంటుంది. అయితే ఇప్పుడు టివి హోస్ట్ గా కొత్త టర్న్ తీసుకున్నాడు. నీకు మాత్రం చెప్తా ప్రోగ్రాం బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ తరహా షోలా అనిపిస్తుంది.

 

షోలో పాల్గొన్న సెలబ్రిటీస్ ను ఇబ్బంది పెట్టి వాళ్ళ సీక్రెట్స్ బయటకు లాగడమే ఈ షో కాన్సెప్ట్. తరుణ్ భాస్కర్ హోస్ట్ గా ఎలా సత్తా చాటుతాడో చూడాలి. ఈటివి ప్లస్ లో ఈ షో రాబోతుంది. హోస్ట్ గా తరుణ్ సక్సెస్ అయితే బుల్లితెర మీద అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక దర్శకుడిగా వెంకటేష్ తో ఒక సినిమా ఉంటుందని వార్తలు రాగా.. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే రాలేదు. మరి డైరక్షన్ కన్నా ఇతర యాక్టివిటీస్ మీద తరుణ్ భాస్కర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: