టాలీవుడ్ లో తమిళంలో, బాలీవుడ్ లో లక్ష్మీ రాయ్ అంటే పెద్దగా తెలియని వారు ఉండరు. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఆమెకు మంచి పాపులారిటి వచ్చింది. హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అవకాశాల కోసం ఎదురు చూసింది చూసింది. చివరికి ఆమెకు ఐటెం సాంగ్స్ లో చేసే అవకాశం వచ్చింది. సెకండ్ హీరోయిన్ గా ఆమె నటించినా ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. చాలా సినిమాల్లో ఆమె ఐటమ్స్ సాంగ్స్ కే పరిమితం అయిపోయింది. అగ్ర హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని కొందరు అన్నారు. 

 

అయినా సరే దర్శక నిర్మాతలు ఆమెకు పెద్దగా ఆ అవకాశాలు ఇవ్వడం లేదు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమాలో ఆమె ఒక పాట చేసింది. ఆ పాటలో ఆమె రత్తాలు గా కనపడింది. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేసినా సరే గుర్తింపు మాత్రం కరువైంది అనే చెప్పాలి. కొందరు దర్శకులు ఆమెకు అవకాశాలు ఇచ్చినా సరే ఆమె పాత్రకు ప్రాధాన్యత లేని సీన్లు ఇస్తున్నారు. దీనిపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తర్వాత సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది స్టార్ హీరోయిన్స్ అయ్యారు కూడా. 

 

అయినా సరే ఆమె మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు రెండు మూడు సినిమాల్లో చేస్తున్నా అవి కూడా పెద్ద సినిమాలు ఏమీ కాదు. డాన్స్ పరంగా ఆమె చాలా మంది కంటే మంచి ప్రదర్శనే చేసింది అని చెప్పాలి. అయినా సరే అవకాశాలు రావడం కష్టం అవుతుంది. ఆమెలో మంచి నటి ఉన్నారని కాని దర్శకులు ఆమెను వాడుకోవడం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా పాపం రత్తాలు మాత్రం ఇప్పుడు సినిమాల్లో ఇబ్బంది పడుతుంది. మరి ఆమెకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: