కమర్షియల్‌ సినిమా అంటే ఓ ఫార్ములా ఉంటుంది. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, హీరో ఎలివేషన్‌, హీరోయిన్‌ గ్లామర్‌తో పాటు కమర్షియల్ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉండాల్సిందే. మాస్‌ ఆడియన్స్‌లో సినిమా మరింత ఊపు తీసుకురావాలంటే ఐటమ్‌ సాంగ్ కంపల్సరి. అందుకే మాస్‌ ను టార్గెట్ చేసి తెరకెక్కించిన సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ కంపల్సరీగా ఉంటాయి. అయితే ఐటమ్‌ సాంగ్‌ అంటే హీరోయిన్స్‌ మాత్రమే కాదు. అప్పుడప్పుడు హీరోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

ఇటీవల యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఐటమ్‌ సాంగ్‌లో కనిపించాడు. తానే స్వయంగా నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించాడు విజయ్‌ దేవరకొండ. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ఓ ప్రమోషనల్‌ సాంగ్‌లో నటించాడు. సినిమాలో కనిపించకపోయినా స్పెషల్ సాంగ్ లో కనిపించి సినిమా హైప్‌ తీసుకువచ్చాడు విజయ్‌.

 

యంగ్ హీరోలే కాదు సీనియర్‌ హీరోలు కూడా ఇాలాంటి సాహసాలు చేశారు. ఇప్పుడే కాదు 90లలోనే ఐటమ్‌ సాంగ్ చేశాడు కింగ్ నాగార్జున. ఎస్వీ కృష్ణరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఘటోత్కచుడు సినిమా కోసం నాగార్జున స్పెషల్ సాంగ్‌లో నటించాడు. ఈ సినిమాలో ప్రియ మధురం అంటూ సాగే ఫాంటసీ సాంగ్‌లో కనిపించి అలరించాడు కింగ్‌.

 

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ కృష్ణ కూడా స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి అలరించాడు. అలీ హీరోగా తెరకెక్కిన యమలీల సినిమాలో జుంబారే జుజుంబారే అంటే ఆ సినిమా సక్సెస్‌ కు తనవంతు సాయం చేశాడు. పరభాషా నటులు కూడా మన సినిమాల్లో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించారు. 90లలోనే వచ్చిన బాలకృష్ణ సినిమా గాంఢీవం. బాలయ్య, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన ఈ సినిమాలో గోరువంక వాలగానే అనే పాటలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ఆడి పాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: